మూడోసారి ఆశీర్వాదం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Third time blessing Prime Minister Narendra Modi

Jan 31, 2025 - 14:22
 0
మూడోసారి ఆశీర్వాదం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

తొలి బడ్జెట్​ కు సిద్ధం
దుష్టశక్తులకు గుణపాఠం
పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాల్లో ప్రసంగం
నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు జరగొచ్చు
మహిళ, యువత ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్​

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రజలు మూడోసారి నమ్మకం ఉంచి మరోసారి మనపై గురుతర బాధ్యతలను ఉంచారని, వారి ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మూడోసారి తొలిసారి బడ్జెట్​ లో పేద, మధ్యతరగతి ప్రజల ఆశీర్వాదం మరోసారి తమకు లభించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 1 శనివారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్​ దేశంలో నూతన విశ్వాసాన్ని నింపుతుందని చెప్పారు.

విదేశీ శక్తులతో చేతులు కలిపి..
ప్రతీ బడ్జెట్​ కు ముందు కొన్ని దుష్టశక్తులు అల్లర్లు చేసేందుకుచ సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయని అలాంటి వారి కొరత లేదన్నారు. చాలాసార్లు పార్లమెంట్​ లో గందరగోళం జరగడం దేశ ప్రజలు స్వయంగా చూశారన్నారు. పెగాసెస్​, జార్జ్​ సోరెస్​, హిండెన్​ బర్గ్​ లాంటి విదేశీ శక్తులతో కలిసి మనదేశ ప్రజా సమస్యల వేదికను ఈ దుష్టశక్తులు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. 

140 కోట్ల మంది అభివృద్ధికి కట్టుబడి..
శుక్రవారం పార్లమెంట్​ బడ్జెట్​ ప్రారంభ సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారత్​ కు లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. వందేళ్ల స్వాతంత్ర్యం జరుపుకునే నాటికి భారత్​ పూర్తి అభివృద్ధి దిశగా రూపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. 140 కోట్ల మంది ప్రజలు దేశ అభివృద్ధికి, గౌరవానికి కట్టుబడి ఉండాలని తెలిపారు. సర్వతోముఖాభివృద్ధికి మిషన్​ మోడ్​ లో ఉన్నామని ప్రధాని తెలిపారు. 

బడ్జెట్​ లో మహిళలకు ప్రత్యేక ప్రకటనలు..
దేశంలో మహిళశక్తికి సంబంధించి బడ్జెట్​ లో ప్రత్యేక ప్రకటనలు ఉండవచ్చన్నారు. ప్రతీ మహిళకు గౌరవం దక్కుతుందని, సమాన హక్కులు చేకూరుతాయన్నారు. మహిళా శక్తిని మరింత ప్రోత్సహించే లక్ష్యంతో మరిన్ని కీలకమైన నిర్ణయాలు ఉండనున్నాయని స్పష్టం చేశారు. అదే సమయంలో యువశక్తికి కూడా అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. దీని వల్ల పెద్ద మార్పులు కనిపిస్తాయన్నారు. భారత్​ లో అపారమైన యువశక్తి ఉందన్నారు. ఈ బడ్జెట్​ లో ఎన్నో కీలకమైన నిర్ణయాలు యువశక్తి కోసం వెలువడతాయని తెలిపారు. నూతన బడ్జెట్​ దేశప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని చూరగొంటుందన్నారు. దేశాన్ని మరింత బలోపేతం చేసే చట్టాలను రూపొందిస్తామని స్పష్టం చేశారు. రాబోయే 25 ఏళ్లలో సంపన్న భారత్​ కలను నేరవేర్చుకునే దిశగా శిఖరాగ్రానికి చేరుకుంటామని తెలిపారు.