అరుణాచల్ లో బీజేపీ విజయఢంకా
46 సీట్లతో సింగిల్ టార్జెస్ట్ మెజార్టీ పార్టీగా అవతరణ
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ విజయఢంకా మోగించింది. 46 సీట్లను స్వాధీనం చేసుకొని అరుణాచల్ లో పాగా వేసింది. 2019లో 41 స్థానాలను సాధించగా గతంకంటే ఐదు సీట్లను ఎక్కువగా సాధించి సింగిల్ లార్జెస్ట్ మెజార్టీ పార్టీగా అవతరించింది. ఆదివారం ఉదయం నుంచి జరిగిన అసెంబ్లీ ఓట్ల లెక్కింపు వార్ వన్ సైడ్ అన్నట్లుగానే సాగాయి. 60 అసెంబ్లీ స్థానాలున్న అరుణాచల్ లో తొలుత రౌండ్ నుంచే బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఎన్పీపీ 5, కాంగ్రెస్ 1, ఇతరులు 8 స్థానాల్లో విజయం సాధించారు. 2019లో ఎన్పీపీ 5, కాంగ్రెస్ 4, ఇతరులు 10 స్థానాలను దక్కించుకున్నారు.
అరుణాచల్ గవర్నర్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్ తో బీజేపీ నాయకులు భేటీ కానున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకై సమయం విధివిధానాలను ఆయనతో చర్చించనున్నారు. మోదీ నేతృత్వంలో మరోమారు అరుణాచల్ ను బీజేపీ తన ఖాతాలో వేసుకుంది.