యూఎన్ఎస్సీలో పాక్ పై పర్వతనేని ఆగ్రహం
In the UNSC, there is a mountain of anger against Pakistan

న్యూయార్క్: ఐక్యరాజ్యసమితిలో పాక్ విధానాలను భారత ప్రతినిధి పర్వతనేని హరీష్ తీవ్రంగా ఎండగట్టారు. బుధవారం చైనా అధ్యక్షతన యూఎన్ ఎస్ సీ భద్రతా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాక్ ఆరోపణలపై, హరీష్ నిప్పులు చెరిగారు. కశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనన్నారు. పాక్ ఒక ఉగ్రవాద దేశమని ప్రపంచానికి తెలుసన్నారు. భారత్ ఉగ్రవాద దాడి బాధిత దేశమన్నారు. మరోమారు ఇలాంటి అంశాలను మండలిలో లేవనెత్తి సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. జేషే మహ్మద్, లష్కరే తోయిబా, ఇంకా 20 ఉగ్రవాద సంస్థలు ఎక్కడ పుట్టాయని, ఎవరి ఇంట్లో ఉన్నాయని నిలదీశారు. తాము ఉగ్రవాదం ముప్పుతో పోరాడుతున్నామని చెప్పుకుంటూ ఉగ్రవాదాన్ని ఎగదోసే దేశం మీదన్నారు. ఆ దేశం విధానమే ఉగ్రవాదమని, హింస అని, ఇందుకోసం అమాయక పౌరులను తప్పుదోవ పట్టిస్తూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని, కానీ భారత్ వీటిని ఎన్నటికీ సమర్థించబోదన్నారు. పాక్ విదేశాంగ శాఖ మంత్రి మొహమ్మద్ ఇషాక్ దార్ లేవనెత్తిన పలు అంశాలపై పర్వతేని ఫైర్ అవడంతో భద్రత మండలిలోని పాక్ కు సహకరిస్తున్న పలుదేశాలు భారత ఉగ్రరూపాన్ని చూసి నీళ్లు నమిలడం విశేషం.