150 యూనిట్ల ఉచిత విద్యుత్
150 units of free electricity

రూ. 7వేలకు పూజారుల వేతనం పెంపు
రాజస్థాన్ బడ్జెట్ విడుదల
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీలో ఆ రాష్ర్ట ఆర్థిక మంత్రి దియా కుమారి బుధవారం బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగంలో 1.25లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను యువతకు కల్పిస్తామన్నారు. పూజారులకు రూ. 7500 వేతనం, 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సినీయర్ సిటిజన్ల కోసం ఉచిత మతపరమైన పర్యటనకు చర్యలు, రూ. 500 కోట్ల వ్యయంతో వివేకానంద ఉపాధి నిధి ఏర్పాటు, 1.50 లక్షల మంది యువతకు ప్రైవేట్ రంగంలో ఉపాధి, ఆయుష్మాన్ భవ కింద రూ. 3500 కోట్లతో మహాకోష్ ఏర్పాటు, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు అందించేందుకు రూ. 425 కోట్లు కేటాయింపు, వెయ్యి బోరుబావుల ఏర్పాటు, రెండు లక్షల ఇళ్లకు ప్రధాని జల్ జీవన్ మిషన్ కింద ఉచిత తాగునీటి కనెక్షన్లు, ఉచితంగా 50వేల వ్యవసాయ, ఐదు లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లు, పర్యాటక ప్రోత్సాహానికి రూ. 975 కోట్లు, రోడ్లు, వంతెనల నిర్మాణాలకు రూ. 5వేల కోట్లు, జైపూర్ ట్రాఫిక్ వ్యవస్థను సరిదిద్దేందుకు రూ. 250 కోట్ల కేటాయింపు, అటల్ ప్రగతి పథం కింద ఐదువేల గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, 9 గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వేల నిర్మాణానికి రూ. 6వే లకోట్ల కేటాయింపు, లక్పతీ దీదీ కింద 20 లక్షల మందికి రూ. 1 లక్ష రుణాలు, పవర్ ఆఫ్ అటర్నీపై స్టాంపు డ్యూటీని తొలగించారు. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపుదలకు రూ. 43 కోట్లు కేటాయింపు, సోలార్ దీదీ కింద 25వేల మందికి శిక్షణ, 15 సంవత్సరాల వాహనాలను నిలిపివేసేందుకు స్ర్కాప్ పాలసీ తీసుకురానున్నారు. పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛతకు రూ. 900 కోట్లు కేటాయింపు, గ్రీన్ ఆరావళికి రూ. 250 కోట్లు కేటాయింపు, 35 లక్షల మంది రైతులకు రూ. 25వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించనున్నారు.