కేజ్రీపై తొలగని అవినీతి మరకలు!

The stains of corruption on Kejri!

Jan 11, 2025 - 16:24
 0
కేజ్రీపై తొలగని అవినీతి మరకలు!

హస్తం–ఆప్​ ముదిరిన విబేధాలు
తాయిలాలపైనే ఆశలు
భగ్గుమంటున్న పూర్వాంచల్​ ప్రజలు, నాయకులు
రోజుకో పోస్టర్​ తో అవినీతిని ఎండగడుతున్న బీజేపీ
జైలు కెళ్లడం, స్వాతిమాలివాల్​ పై దాడులు
అంతర్గత విబేధాలతో తలపట్టుకుంటున్న కేజ్రీవాల్​
కాషాయానికి అంతకంతకూ పెరుగుతున్న మద్ధతు

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: ఆప్​ అధినేత కేజ్రీవాల్​, ఆ పార్టీ నేతలపై అవినీతి మరకలు తొలగడం లేదు. పైగా ఇండి బ్లాక్​ కూటమితో ఎంపీ ఎన్నికల్లో పోరాటం సల్ఫిన ఈ రెండు పార్టీలు ఢిల్లీ ఎన్నికల్లో మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా సింగిల్​ గానే రంగంలోకి దిగారు. మరోవైపు కాంగ్రెస్​ నేతలు ఆప్​ పై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇంకోవైపు ఆప్​ లోనూ అంతర్గత విబేధాలున్నా కేజ్రీవాల్​ సమయస్ఫూర్తితో వాటిని బయటికి పొక్కనీయడం లేదనే వాదనలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా నేతల ఒత్తిళ్లకు తలొగ్గి కాంగ్రెస్​ తో అసెంబ్లీ ఎన్నికలకు కటీఫ్​ చేసి సింగిల్​ గానే రంగంలోకి దిగారనే మాటలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కేజ్రీవాల్​ అవినీతి మరకలను తొలగించే ప్రయత్నంలో భాగంగా ప్రజలకు తాయిలాల ఆశ చూపుతున్నారు. గత మూడు టెర్మ్​ లుగా అవకాశం ఉన్నా ఆయా పథకాలను అమలు చేయని కేజ్రీవాల్​ సరిగ్గా ఎన్నికలకు ముందు పథకాలను అమలు చేస్తామని హామీ ఇస్తుండటాన్ని ప్రజలు ఏ విధంగా తీసుకుంటారో? వేచి చూడాల్సిందే. ఇంకో వైపు పూర్వాంచల్​ ప్రజలను కించపరిచారన్న అపవాదును మూటగట్టుకున్నారు. వారిని ఏకంగా రోహింగ్యాలతో పోల్చడంతో ఆ వర్గం కేజ్రీ పేరు చెబితేనే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఒకరకంగా చెప్పాలంటే కేజ్రీవాల్​ అధికారంలోకి వచ్చేందుకు పూర్వాంచల్​ ప్రజలు, నాయకులే కీలకంగా వ్యవహరించారని చెప్పొచ్చు.

మరోవైపు బీజేపీ కేజ్రీవాల్​ అవినీతిని రోజుకో రకంగా ఎండగడుతూ రసవత్తర రాజకీయాలకు తెరతీస్తోంది. రోజుకో పోస్టర్​ చొప్పున అన్ని రకాల అవినీతి, తాయిలాల ప్రకటనలను నిలదీస్తుంది. ఈ పరిణామాలు కాస్త కేజ్రీవాల్​ కు ఆ పార్టీ నేతలకు మింగుడుపడడం లేదు. శీష్​ మహల్​, మద్యం, యమునా నది నీరు, ప్రభుత్వ గృహాలు, మురికివాడల శుద్ధికరణ, వాతావరణ కాలుష్యం, ట్రాఫిక్​, విద్య, వైద్యం ఇలా అన్ని రంగాల్లో ఆప్​ అధినేత అవినీతిపై ఎప్పటికప్పుడూ నివేదికలు, చిత్రాల రూపంలో రోజుకోరీతిన విడుదల చేస్తుంది. దీంతో ఆప్​ నేతలు బీజేపీ నాయకులపై రీ కౌంటర్​ వేస్తున్నారు. 

2025 నూతన సంవత్సరంలో కేజ్రీవాల్​ కు రాజకీయంగా అతిపెద్ద సవాళ్లే ఎదురవుతున్నాయి. ఆ పార్టీ నాయకులు అవినీతి ఆరోపణలపై జైలుకు వెళ్లడం, అప్పటివరకూ ఆప్​ లో కీలక పదవికి బాధ్యత వహించిన మహిళా నాయకురాలు స్వాతి మాలివాల్​ పై దాడి, పూర్వాంచల్​ ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు లాంటివి ఆయన ప్రతిష్ఠను ప్రజల్లో మసకబారుస్తున్నాయి. 

గతం..
1993 బీజేపీ ఓట్ల శాతంలో పెద్దగా పెరుగుదల చోటు చేసుకోలేదు. 2020లో 30 శాతం వరకు ఓట్​ షేర్​ ను కలిగి ఉంది. 2008లో 40 శాతానికి పెంచుకోగలిగింది. అదే సమయంలో 2013లో గణనీయంగా 15 శాతానికి తగ్గింది. 2015లో మరింత తగ్గి 9.7 శాతంగా నమోదైంది. బీజేపీ ఓటు బ్యాంకు షేర్​ ఆప్​ పార్టీకి మారింది. 2024 ఎంపీ ఏడుస్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓటుశాతం గణనీయంగా  పెంచుకోగలిగింది. అంటే ఆప్​ పార్టీకి మొగ్గుచూపిన ఓటర్లు క్రమేణా బీజేపీ వైపు మళ్లారనే సంకేతాలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

చాందీనీ చౌక్​ 58, ఈశాన్య న్యూ ఢిల్లీ 63, తూర్పు ఢిల్లీ 59, న్యూ ఢిల్లీ 55, వాయువ్య ఢిల్లీ 58, పశ్చిమ ఢిల్లీ 58, దక్షిణ ఢిల్లీ 56 శాతం ఓటు బ్యాంకు షేర్​ ను బీజేపీ ఎంపీ ఎన్నికల్లో దక్కించుకోగలిగింది. ఈ లెక్కన చూసుకుంటే బీజేపీకి అసెంబ్లీ ఎన్నికలలో తిరుగులేదనిపిస్తోంది. మరోవైపు బీజేపీ అధిష్టానం బలం పుంజుకోవడంతోనే సరిపెట్టుకోవడం లేదు. చావో రేవో తేల్చుకోవాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో బూత్​ స్థాయి నుంచి నాయకులు, కార్యకర్తలతో వరుస సదస్సులు, సమావేశాలను నిర్వహిస్తూ ప్రజాభిప్రాయం మేరకు గెలుపు గుర్రాల ఎంపికను రూపొందిస్తుంది. బీజేపీ 29 మంది అభ్యర్థులతో ఒకే జాబితాను ప్రకటించింది. త్వరలోనే రెండో జాబితా విడుదల చేయనుంది.