వీర ధీర శూరన్ వచ్చేశాడు

త‌నదైన విల‌క్ష‌ణ ప్రదర్శనలతో త‌మిళ సినీరంగంలో అగ్ర క‌థానాయ‌కుడిగా స‌త్తా చాటిన చియాన్ విక్ర‌మ్ ప్ర‌యోగాత్మ‌క ఎంపిక‌లు ప్ర‌తిసారీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూనే ఉన్నాయి.

Apr 18, 2024 - 15:10
 0
వీర ధీర శూరన్ వచ్చేశాడు

త‌నదైన విల‌క్ష‌ణ ప్రదర్శనలతో త‌మిళ సినీరంగంలో అగ్ర క‌థానాయ‌కుడిగా స‌త్తా చాటిన చియాన్ విక్ర‌మ్ ప్ర‌యోగాత్మ‌క ఎంపిక‌లు ప్ర‌తిసారీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూనే ఉన్నాయి. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వ‌రుస‌గా ప్ర‌యోగాల‌కు సిద్ధంగా ఉండే హీరో అత‌డు. నేడు అత‌డి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సెట్స్ పై ఉన్న సినిమాల గురించిన ప్ర‌క‌ట‌న‌లు వెలువ‌డుతున్నాయి. ఇంత‌కుముందే తంగ‌ళ‌న్ నుంచి మేకింగ్ వీడియో విడుద‌లై ఆక‌ట్టుకుంది.

చియాన్ విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా త‌న కెరీర్ 62వ చిత్రం టైటిల్ టీజర్ ను ఇప్పుడు రివీల్ చేసారు. తాజా చిత్రం టైటిల్ 'వీర ధీర శూరన్'. తెలుగు టైటిల్‌తో త్వరలో ప్రకటించ‌నున్నారు. ఈ చిత్రంలో విక్ర‌మ్ పూర్తి మాస్ అవ‌తార్ లో క‌నిపించ‌నున్నారు. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ విక్రమ్‌ను కాళిగా పరిచయం చేసింది. ఒక సాధారణ కిరాణా దుకాణం యజమాని యాక్ష‌న్ రియాక్షన్ ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. ప్రతీకార విలన్ల గుంపును ఎదుర్కొన్నప్పుడు కాళీ కిరాణా కొట్లో దాచిన ఆ సీక్రెట్ ఏమిట‌న్న‌ది ఉత్కంఠ పెంచుతోంది. గుంపుగా ఎంత‌మంది వ‌చ్చినా ఎదుర్కొనే ఒకే ఒక్క ధీమా పొట్లాం అత‌డి కొట్లో దాగి ఉంది.

అదేమిట‌న్న‌ది తెర‌పైనే చూడాలి. గొప్ప‌ అచంచలమైన ధైర్యాన్ని ప్రదర్శించే కిరాణా కొట్టోడిని టీజ‌ర్‌లో చూపించారు. మాస్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన టీజర్ సినిమాపై అంచనాలను ఎఫెక్టివ్‌గా పెంచింది. విక్రమ్ పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, సస్పెన్స్‌తో కూడిన ప్లాట్ సెటప్ .. హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లు థ్రిల్లింగ్ సినిమాటిక్ అనుభవాన్ని అందించాయి.  

అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హెచ్ ఆర్  పిక్చర్స్ బ్యానర్ నిర్మించింది. అత్యున్న‌త‌ సాంకేతిక బృందం ఈ సినిమాకి ప‌ని చేసింది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం, తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ సినిమాపై ఓవరాల్ ఇంపాక్ట్‌ని పెంచాయ‌ని టీమ్ చెబుతోంది. ఈ చిత్రంలో విక్రమ్‌తో పాటు ఎస్‌జె సూర్య, దుసరా విజయన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

టీజర్ ప్రధానంగా విక్రమ్ పాత్రపై ఆస‌క్తిని పెంచింది. ప్రతిభావంతులైన నటుల పాత్రల్లోని కోణాన్ని ఆకర్షణీయమైన ప్రదర్శనలను ఇందులో రివీల్ చేసారు. చియాన్ 62 టైటిల్ ఉత్కంఠ‌ను పెంచుతోంది. విక్ర‌మ్ మాస్ అవ‌తార్ స్పెష‌ల్ ట్రీట్ కానుంద‌ని భ‌రోసా క‌నిపిస్తోంది. మొత్తం మీద, వీర ధీర శూరన్ యాక్షన్, సస్పెన్స్, మాస్ అప్పీల్ ఆక‌ట్టుకున్నాయి. వీర ధీర శూర‌న్ కి తెలుగు టైటిల్ గా వీరుడు ధీరుడు శూరుడు అని ఫిక్స్ చేసేందుకు అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా.