అతడే నా..డార్లింగ్
బోల్డ్ పెర్ఫామెన్సెస్ తో ఫ్లెక్సిబిలిటీ ఉన్న బ్యూటీగా కన్నడిగ నభా నటేష్ సుపరిచితం.
బోల్డ్ పెర్ఫామెన్సెస్ తో ఫ్లెక్సిబిలిటీ ఉన్న బ్యూటీగా కన్నడిగ నభా నటేష్ సుపరిచితం. ఇస్మార్ట్ శంకర్ లాంటి మాస్ చిత్రంలో రాపోతో పోటీపడుతూ మాస్ పెర్ఫామెన్సెస్ తో అదరగొట్టింది ఈ బ్యూటీ. నభా కొంతకాలంగా రకరకాల కారణాలతో సినిమాలకు దూరంగా ఉంది. ఇటీవలే చారిత్రక నేపథ్యం ఉన్న కథలో నటిస్తున్నట్టు ప్రకటన వచ్చింది. నిఖిల్ సరసన స్వయంభు అనే భారీ చిత్రంలో నభా నటిస్తోంది. స్వయంభు చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. రవి బస్రూర్ సంగీతం ప్రధాన బలాలు. ఠాగూర్ మధు సమర్పణలో, పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్ -శ్రీకర్ నేతృత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అన్ని ప్రధాన భారతీయ భాషలలో విడుదల కానుంది. నభా కొంత గ్యాప్ తర్వాత వచ్చినా భారీ క్రేజ్ ఉన్న చిత్రంతో కంబ్యాక్ కి ప్రయత్నిస్తోంది. వరుస హిట్లతో దూకుడుమీదున్న నిఖిల్ సరసన తాజా ఆఫర్ తనకు పెద్ద ప్లస్ కానుంది. ఇదిలా ఉండగానే నభా నిరంతరం సోషల్ మీడియాల్లో అభిమానుల కోసం స్పెషల్ వీడియోషూట్లు ఫోటోషూట్లతో అలరిస్తోంది. తాజాగా నభా షేర్ చేసిన ఇన్ స్టా పోస్ట్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. నభా డార్లింగ్ అంటూ అందమైన ముఖకవళికలతో ఆహార్యాన్ని ప్రదర్శిస్తున్న ఈ వీడియో ప్రభాస్ అభిమానుల్లో వైరల్ గా మారుతోంది. ఇందులో ప్రభాస్ డార్లింగ్ అంటూ చెబుతున్న పాపులర్ డైలాగులన్నిటినీ ఓచోట మాషప్ లా ఉపయోగించారు. దీనికి నభా ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. ఈ వీడియో చూశాక ప్రభాస్ ని అనుకరించిన నభాను పొగిడేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. తమ ఫేవరెట్ డార్లింగ్ డైలాగ్స్ ని గుర్తు చేసినందుకు అభినందిస్తున్నారు. నభా తదుపరి కెరీర్ కి బూస్ట్ ఇచ్చేందుకు ఇప్పుడు ప్రభాస్ అభిమానులు అండగా నిలుస్తున్నారన్నమాట.