సురానా జ్యువెలర్స్ లో ఐటీ సోదాలు రూ. 26 కోట్ల నగదు స్వాధీనం
IT searches in Surana Jewelers Rs. 26 crore cash seized
మహారాష్ట్ర: నాసిక్ లోని సురానా జ్యువెలర్స్ పై ఐటీ శాఖ ఆదివారం దాడులు నిర్వహించింది. సంస్థ కార్యాలయం, ఆఫీసు, ఇళ్లలో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో రూ. 26 కోట్ల నగదుతోపాటు, రూ. 90 కోట్ల లెక్కల్లో చూపని ఆస్తులకు సంబంధించిన పేపర్లను స్వాధీనం చేసుకుంది. గతంలో ఐటీ పన్నుల్లో చెల్లింపులు, ప్రస్తుత చెల్లింపుల్లో భారీ తేడాలున్నట్లు గుర్తించింది. అంతేగాక ఈ జ్యువెలర్స్ బిల్లులు లేకుండా ట్యాక్స్ ఎగ్గొడుతూ అమ్మకాలు, బంగారం కొనుగోళ్లను కూడా చేస్తున్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో పలుమార్లు నోటీసులు జారీ చేసినా సురానా సంస్థ యాజమానులు స్పందించకపోవడంతో ఐటీశాఖ దాడులు నిర్వహించింది.