చిన్మోయ్ విడుదలపై మోదీకి ఇస్కాన్ విజ్ఞప్తి
ISKCON appeals to Modi on Chinmoy's release
హిందూ నిరసనకారులపై జమాత్ ఉగ్రమూకల దాడులు
50మందికి పైగా గాయాలు
హిందువులపై కక్ష్యసాధింపు చర్యలకు దిగుతున్న బంగ్లా ప్రభుత్వం
ఢాకా: బంగ్లాదేశ్ లోని ఇస్కాన్ సెక్రెటరీ చిన్మోయ్ దాస్ అరెస్టుపై హిందువులు భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. మంగళవారం చేపట్టిన ఈ నిరసనల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసన వ్యక్తం చేస్తున్న హిందువులపై జమాత్ కు చెందిన ఉగ్రమూకలు భారీ దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో 50మందికి పైగా హిందువులకు గాయాలయ్యాయి. చిన్మోయ్ దాస్ అరెస్టుపై ఇస్కాన్ సంస్థ ప్రధాని నరేంద్రమోదీ, విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జయశంకర్ ను సహాయం కోరారు. ఆయన్ను అరెస్టు చేసిన విషయాన్ని కూడా కనీసం భారత్ కు సమాచారం అందించలేదు. బంగ్లాదేశ్ కక్ష్యసాధింపు చర్యలకు దిగుతుందని స్పష్టంగా అర్థమవుతుంది. తాత్కాలిక యూనస్ ప్రభుత్వం పూర్తి ఆర్థిక బంధనాల్లో చిక్కుకుపోవడం, భారత్ సహాయం లభించకపోవడం, మరోవైపు ఉగ్రభావజాలం ఉన్న నాయకుల సహకారంతో ప్రభుత్వం ఏర్పడడం తదితర పరిణామాలన్నీంటితో హిందువులపై దాడులకు పాల్పడుతుంది. ఇలాంటి దుందుడుకు చర్యలతో బంగ్లాదేశ్ తన కంట్లో తానే వేలు పొడుచుకుంటోందని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికే భారత్ తో పెట్టుకున్న అనేక దేశాలు అడుక్కుతినే పరిస్థితుల్లో ఉన్నాయన్న సంగతిని బంగ్లాదేశ్ మరిచినట్లుంది.