కన్నీటి పర్యంతమైన నిఖత్​

బాక్సింగ్ లో ఓటమి దేశ ప్రజలకు క్షమాపణలు రెట్టించిన ఉత్సాహంతో వస్తానంటూ భావోద్వేగం లవ్లీనాపై ఆశలు సజీవం

Aug 1, 2024 - 17:37
 0
కన్నీటి పర్యంతమైన నిఖత్​
పారిస్​: ఎంతో కష్టపడి ఇక్కడ వరకు చేరుకున్నా ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోకపోవడం పట్ల బాక్సింగ్​ క్రీడాకారిణి నిఖత్​ జరీన్​ కన్నీటి పర్యంతం అయ్యారు. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. పొరపాటు ఎక్కడ జరిగిందో సరిచూసుకుంటానన్నారు. రెట్టించిన ఉత్సాహంతో తిరిగి వస్తానని భావోద్వేగంతో తెలిపారు. 
 
గురువారం 50 కిలోల ఒలింపిక్స్​ పోటీల్లో నిఖత్​ జీన్​ (భారత్​), వూ యూ (చైనా) చేతిలో ఓటమి పాలయ్యారు.  వూ యూ 5–0 తేడాతో విజయం సాధించింది. నిఖత్​ జరీన్​ ఒలింపిక్స్​ పోటీల్లో పాల్గొనడం ఇదే తొలిసారి. 
జర్మనీ కరీనాతో నిఖత్​ 5–0 తేడాతో విజయం సాధించి ప్రీ క్వార్టర్స్​ కు అర్హత సాధించింది. 
 
బాక్సింగ్​ లో అసోంకు చెందిన మరో క్రీడాకారిణి లవ్లీనా బొర్గొహైన్​ క్వార్టర్ ఫైనల్​ లోకి అడుగిడింది. ఇప్పుడు బాక్సింగ్​ లో ఈ క్రీడాకారిణి పతకం సాధించాలని భారత క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.