టీటీడీ లడ్డూ కల్తీపై నివేదిక కోరిన కేంద్రం
సీఎంతో మాట్లాడానన్న కేంద్రమంత్రి జేపీ నడ్డా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ప్రకారం చర్యలు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: తిరుపతి ఆలయ లడ్డూ కల్తీ ఆరోపణలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంత్రి జేపీ నడ్డా సమగ్ర నివేదిక కోరారు. శుక్రవారం లడ్డూ వివాదంపై సీఎం వ్యాఖ్యలు, నివేదికలపై వస్తున్న వార్తలపై స్పందిస్తూ మీడియాతో మాట్లాడారు. ఈ వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబును నివేదిక కోరామన్నారు. ఆ రాష్ర్ట ప్రభుత్వం నివేదిక సమర్పించాక కల్తీ విషయంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తామని తెలిపారు. సీఎం చంద్రబాబుతో ఈ వివాదంపై మాట్లాడానని మంత్రి నడ్డా తెలిపారు. ప్రభుత్వానికి అందిన కల్తీ నివేదికలను కేంద్రంతో పంచుకోవాలని కోరామన్నారు. దీనిపై రాష్ర్ట రెగ్యులేటర్లతో కూడా మాట్లాడి విచారణ జరుపుతానని తెలిపారు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని జేపీ నడ్డా స్పష్టం చేశారు. ప్రస్తుతానికి తాను నివేదిక కోరానని, దానిని పరిశీలిస్తామని నడ్డా తెలిపారు.