వాళ్లతో మాత్రం టచ్ లోనే ఉంది
అనీల్ కపూర్ వారసురాలిగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సోనమ్ కపూర్ సక్సెస్ అయిన వైనం గురించి చెప్పాల్సిన పనిలేదు.
అనీల్ కపూర్ వారసురాలిగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సోనమ్ కపూర్ సక్సెస్ అయిన వైనం గురించి చెప్పాల్సిన పనిలేదు. `సవారియ్యా`తో ఎంట్రీ ఇచ్చిన సోనమ్ కెరీర్ కొన్నాళ్ల పాటు దేదీప్యమానంగా సాగిపోయింది. వైవిథ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది. కెరీర్ పీక్స్ లో ఉండగానే వివాహం చేసుకుని సెకెండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది. మాతృమూర్తిగానూ మారిపోయింది. అయితే అమ్మడి సెకెండ్ ఇన్నింగ్స్ మాత్రం ఇంకా పుంజుకోలేదనే చెప్పాలి. వివాహమైన దగ్గర నుంచి చూస్తే ఆమె సినిమాల సంఖ్య తగ్గిపోయింది. మునుపటిలా సినిమాలు చేయడం లేదు. మరి అవకాశాలు రాక చేయడం లేదా? లేక వస్తున్నా కుటుంబ జీవితానికే ప్రాధాన్యత ఇచ్చి ఆమె ముందుకు రావడం లేదా? అన్నది అర్దంకాని ప్రశ్న. అయితే వివాహ బంధం..కుటుంబ జీవితానికి విలువనిస్తూ ఆమె చేసిన కొన్ని పోస్టులు ఎంతో ఇంట్రెస్టింగ్ గా అపినించాయి. సెలబ్రిటీ హోదా అనుభవించడం కంటే? సాధరణ జీవితానికే.. అందులోనూ కుటుంబంతో కలిసి ఉండటం అంటే ఎంతో ఇష్టమని చెప్పిన సందర్బాలెన్నో. Also కాబట్టి అవకాశాలు రాకపోయినా సోనమ్ వాటిపట్ల పెద్ద పట్టించుకునే టైప్ కాది తెలుస్తోంది. ఈ రెండేళ్ల కాలంలో కేవలం ఒక్క సినిమానే చేసింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు టచ్ లోనే ఉంటుంది. సినిమాలు చేయకపోయినా మీడియాలో అటెన్షన్ మాత్రండ్రా చేస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలతో అలరిస్తుంది. అయితే మునుపటిలా గ్లామర్ ఫోజులకు మాత్రం దూరంగా ఉంటుంది. వివాహమైన దగ్గర నుంచి సోనమ్ తాను పెట్టుకున్న కండీషన్ మాత్రం క్రాస్ చేయలేదు. లిమిట్స్ ని మెయింటెన్ చేస్తూ ఫోటో షూట్స్ చేస్తుంది. తాజాగా సోనమ్ కొత్త ఫోటోలు కొన్ని నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందులో అమ్మడు ప్లోరల్ ఔట్స్ పిట్స్ లో ఎంతో డీసెంట్ గా కనిపిస్తుంది. మల్టీకలర్స్ అండ్ డిజైన్ దుస్తుల్లో సోనమ్ తళుకులీనింది. ఫోకస్ అంతా డ్రెస్ ఎలివేషన్ పైనే పెట్టి చేసిన షూట్ లా ఉంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.