పలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు

ఏమీ లేదని తేల్చిన భద్రతా సిబ్బంది

Jun 18, 2024 - 19:47
 0
పలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశంలోని పలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మెయిల్​ ద్వారా మంగళవారం పాట్నా, కోయంబత్తూరు, జైపూర్​, వడోదరా, శంషాబాద్​ విమానాశ్రయాలకు ఈ బెదిరింపులు వచ్చాయి. దీంతో భద్రతా సిబ్బంది, ఏయిర్​ పోర్టు వర్గాలు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో అనుమానాస్పద వస్తువులేవీ గుర్తించలేదన్నారు. గుర్తుతెలియని వ్యక్తి మెయిల్​ ద్వారా దేశంలోని 40 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే బెదిరింపుల కారణంగా పలు విమానాశ్రయాల్లో విమానాలు ఆలస్యంగా నడిచాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆయా బెదిరింపుల నేపథ్యంలో ఏయిర్​ పోర్టుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. బెదిరింపులకు పాల్పడిన మెయిల్​ పై ఆరా తీస్తున్నారు. ఇటీవల పాఠశాలలు, ఆసుపత్రులు, విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు సర్వసాధారణంగా మారిపోయాయి. దుండగులు విదేశాల నుంచి ఈ మెయిల్​ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు అధికార వర్గాలు పలుమార్లు గుర్తించాయి.