హెలికాప్టర్​ క్రాష్​ ల్యాండింగ్​ సుష్మ అంధారేకు తప్పిన ముప్పు

మహారాష్ట్రలోని శివసేన నేత సుష్మ అంధారేకు తృటిలో ప్రమాదం తప్పింది.

May 3, 2024 - 13:16
 0
హెలికాప్టర్​ క్రాష్​ ల్యాండింగ్​ సుష్మ అంధారేకు తప్పిన ముప్పు

ముంబై: మహారాష్ట్రలోని శివసేన నేత సుష్మ అంధారేకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణించాల్సిన హెలికాప్టర్​ ఆమె ఎక్కే ముందు ప్రమాదానికి గురైంది. శివసేన అధికార ప్రతినిధి సుష్మా అందారే ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మహద్​ పట్టణంలోని హెలికాప్టర్​ ల్యాండ్​ కానున్న గ్రౌండ్​ కు చేరుకున్నారు. ఇంతలో హెలికాప్టర్​ రానే వచ్చింది. వస్తూ వస్తూ దిగేందుకు ప్రయత్నించి క్రాష్​ ల్యాండింగ్​ అయ్యింది. క్రాష్​ ల్యాండింగ్​ సందర్భంగా పైలెట్​ కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ ప్రమాదం తరువాత ఆమె కారులో వెళ్లిపోయారు. ఈ ప్రమాదంలో హెలికాప్టర్​ తీవ్రంగా దెబ్బతింది. రెక్కలు పూర్తి స్థాయిలో విరిగిపోయాయి. అయితే ప్రమాదతీరు వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ గా మారింది. 

అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్‌లు ప్రమాదం విచారణ చేపట్టారు. పైలెట్​ కు స్వల్ప గాయాలు కావడంతో ప్రాథమిక చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.