పేపర్ వర్క్ తో విముక్తి
మదిలో ‘పీ–2, జీ–2’ గేమర్లతో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: 2047 వరకు దేశ ప్రజలకు పేపర్ వర్క్ తో పూర్తిగా విముక్తి కల్పించాలనేదే తమ ఉద్దేశ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఏదైనా పనుల నిమిత్తం రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉండడాన్ని పూర్తిగా తగ్గించివేస్తామన్నారు. ఆయా పనులు నిమిషాల్లోనే పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తన మదిలోనూ ఓ గేమ్ ఉందని ‘పీ–2, జీ–2’ అని అన్నారు. అంటే ప్రొ పీపుల్ గుడ్ గవర్నెన్ (ప్రభుత్వం నుంచి ప్రజలకు అనుకూలమైన పాలన) అందించడమే తమ ఉద్దేశ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
భారత్ లో గేమింగ్ పరిశ్రమ ఫరిడవిల్లుతుండడంతో శనివారం ఉదయం భారత్ లో టాప్ ఏడుగురు గేమర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలిశారు. వారితో గేమింగ్ రంగంలో ఉన్న ఆటుపోట్లను, మంచి చెడులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి పలు గేమ్ లను ఆడారు.
దేశహితమే లక్ష్యంగా గేమ్ లుండాలి..
గేమింగ్ రూపకల్పన ఏదైనా చేస్తే దేశహితం కోసం చేయాలన్నారు. అదే సమయంలో చట్టం, న్యాయపరిధిలను దాటకూడదన్నారు. దేశ యువతను చెడుమార్గం నుంచి సన్మార్గంలో ఉంచేలా పంచతంత్ర లాంటి చారిత్రక విషయాలతో కూడిన గేమింగ్ లను రూపొందించాలన్నారు. ఈ గేమ్ ల వల్ల దేశంలోని యువత, పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరిగేలా, తోడ్పడేలా గేమ్ లను రూపొందించాలని పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ గేమ్ లు..
అంతర్జాతీయంగా నేడు ప్రపంచంలో రూపొందుతున్న గేమ్ లలో ఎక్కువగా తుపాకులు, కత్తులు, మారణాయుధాలు, బాంబులు లాంటి హింసాప్రవృత్తివే కలిగి ఉండడం విచారకరమని తెలిపారు.
చెడు గేమ్ లను దూరం పెట్టాలి..
భారత్ లోని గేమర్లు అలాంటి వాటిని దూరం పెడుతూనే మానవాళికి మంచి జరిగే గేమ్ లను రూపొందించాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయన్నారు. అదే సమయంలో భారత ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చే విధంగా కూడా గేమ్ ల రూపకల్పన జరగాలన్నారు. భవిష్యత్ లో భారత్ గేమింగ్ రంగంలో ఓ నూతన పోకడను తీసుకురావాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. గేమింగ్ పరిశ్రమలను రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం లేదని ప్రధాని వివరించారు. ఈ పరిశ్రమ ఎప్పటికప్పుడు నూతన పోకడలతో భారత వ్యవస్థకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని తెలిపారు.
మోసాలను అరికట్టాలి..
గేమింగ్ రంగంలో రెండు విధాలుంటాయని మోదీ అన్నారు. ఒక రకం ఆటలను ప్రోత్సహిస్తే మరో రకం సైబర్ మోసాలతో ప్రజలను కొల్లగొడుతుందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని భారతీయ గేమర్లు మంచిని ప్రోత్సహించాలని సైబర్ మోసాల గేమ్ లను అరికట్టే గేమ్ లను రూపొందించాలని తెలిపారు.నేడు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది గేమ్ లలో డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని ఇది విషాదకర పరిణామమన్నారు. అలాంటి ఆటలను పూర్తిగా భారత్ నుంచి రూపుమాపాలనేదే తమ ఉద్దేశ్యమన్నారు. ఇందుకు సంబంధించిన భద్రతా వ్యవస్థపై దృష్టి సారించాలని గేమర్లకు సూచించారు.
సమస్యలు, సవాళ్లు..
గేమింగ్ రంగం అనగానే ముందుగా తమకు ఎదురయ్యే సమస్య కుటుంబం నుంచే అన్నారు. తల్లిదండ్రులు తమ మనోభావాలను అర్థం చేసుకునేందుకు చాలా సమయమే పట్టిందన్నారు. విద్యతోబాటు తమ నూతన ఆలోచనా విధానాన్ని వారికి వివరించి చెప్పి ఒప్పించేందుకు చాలా సమయమే పట్టిందన్నారు. అటుపిమ్మట గానీ వారు ఒప్పుకోలేదన్నారు. దీంతో తాము గేమింగ్ రంగంలోకి వచ్చి ఫలితాలను సాధించేందుకు విశేష కృషిని చేశామన్నారు. 2020లో ప్రధానమంత్రి గేమింగ్ కోసం ఓ సభలో మాట్లాడాక దేశంలోని విద్యార్థుల తల్లిదండ్రుల్లో మార్పులు వచ్చాయని వివరించారు.
ప్రధానిని కలిసిన గేమర్లు..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన గేమర్లలో నమన్ మాథుర్, అనిమేష్ అగర్వాల్, మిథిలేష్ పాటంకర్, పాయల్ ధరే, అన్షు బిష్త్, తీర్థ మెహతా, గణేష్ గంగాధర్ లు ఉన్నారు.