తేజస్వీ వీడియోపై మండిపడ్డ రాజ్​ నాథ్​

చేపలు తింటూ తేజస్వీ యాదవ్​ విడుదల చేసిన వీడియోపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​ నాథ్​ సింగ్​ మండిపడ్డారు.

Apr 14, 2024 - 17:56
 0
తేజస్వీ వీడియోపై మండిపడ్డ రాజ్​ నాథ్​

పాట్నా: చేపలు తింటూ తేజస్వీ యాదవ్​ విడుదల చేసిన వీడియోపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​ నాథ్​ సింగ్​ మండిపడ్డారు. ఆదివారం బీహార్‌లోని జముయిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఎన్డీయే అభ్యర్థి అరుణ్ భారతికి మద్దతు ఇస్తూ రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. పవిత్రమైన రోజుల్లో మాంసాహారం తింటూ వీడియోలు విడుదల చేస్తావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చేపలే కాదు ఏనుగులు, గుర్రాలను కూడా తినాలని కానీ చూపించడం ఎందుకని మండిపడ్డారు. బెయిల్​ పై, జైలులో ఉన్నవారు ప్రధాని మోదీని జైలుకు పంపుతామని మాట్లాడుతున్నారని ఓసారి వారి చరిత్ర ఏంటో వెనక్కి తిరిగి చూసుకోవాలని మండిపడ్డారు. దేశానికి తేజస్వీ ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్​ చేశారు. మెజార్టీ వర్గం హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పిచ్చి చేష్ఠలతో రామరాజ్య స్థాపనను ఎవ్వరూ ఆపలేరని రాజ్​ నాథ్ సింగ్​ స్పష్టం చేశారు.