బోల్డ్ లుక్..నయనం
Bold look..Nayanam
లేడీ సూపర్ స్టార్ నయనతార ఫోటో షూట్లు సోషల్ మీడియాలో చాలా రేర్. అమ్మడు నెట్టింట యాక్టివ్ గా ఉన్నా! వెకేషన్ ఫోటోలు...ఫ్యామిలీ ఫోటోలు ..జీమ్ వీడియోలు..ఫోటోలుతప్ప మిగతా వాటిని పెద్దగా ఫోకస్ చేయదు. ఈ మద్య కాలంలో బిజినెస్ లోకి ఎంటర్ అవ్వడంతో ఉత్పత్తుల్ని ప్రమోట్ చేసుకోవడం కోసం కాస్త టచ్ లో ఉంటుంది తప్ప! ఫాలోయింగ్ కోసమంటే అమ్మడు ప్రత్యకంగా ఎలాంటి వర్కౌట్ చేయదు. అవార్డు కార్యక్రమాల్లోనూ అతి ముఖ్యమైనవి..నేషనల్..ఇంటర్నేషనల్ రేంజ్ ఉంటే తప్ప! అక్కడా కనిపించడం అంత వీజీ కాదు. కానీ అటెండ్ అయితే గనుక లేడీ సూపర్ స్టార్ మార్క్ బ్యూటీ మాత్రం పడిపోతుంది. మొత్తం ఈవెంట్ కి అమ్మడు హైలైట్ అవుతుంది. తాజాగా ముంబై లో జరిగిన ఓ అవార్డు కార్యక్రమంలో నయన్ ఫ్యాషన్ ఎంపిక మరోసారి చర్చకు తెర తీసింది. డీప్-నెక్ దుస్తుల్లో నయన్ బ్యూటీ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. బ్లాక్ డిజైన్ ప్లోరల్ డీప్ నెక్ నయన్ ని పర్పెక్ట్ గా సూటయింది. అదే డిజైన్ లో క్లీవేజ్ అందాలు అంతే హైలైట్ అవుతున్నాయి. నయన్ స్కిన్ టోన్ అంతకు మించి తళతళలాడిపోతుంది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో అమ్మడి అందంతో మతి చెడాల్సిందే అన్నంతగా ఆకట్టుకుంటుంది. క్లీవేజ్ ని కవరప్ చేస్తూ ఉల్లిపొరను పొలిన డిజైన్ సింథింగ్ స్పెషల్ గా ఫోకస్ అవుతుంది. ఈ డిజైన్ పై సొగసరి ఎలాంటి యాక్సరసీస్ ఎంపిక చేసుకోలేదు. ముక్కుకి పుడక..చెవులకు దిద్దులు లాంటి తప్పనిసరిగా వేసుకుంటుంది. కానీ ఈసారి వాటిని అవైడ్ చేసింది. అలాగే నయన్ మునుపటి కన్నా కాస్త చబ్బీలుక్ లోకి మారినట్లు కనిపిస్తుంది. రూప లావణ్యంలో కొన్ని రకాల మార్పులు గమనించొచ్చు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక నయనతార సినిమాల గురించైతే చెప్పాల్సిన పనిలేదు. కేవలం తమిళ్ సినిమాలే చేస్తుంది. ఇతర భాషల్లో అవకాశాలు వచ్చినా చేయడం లేదు. జవాన్ తో బాలీవుడ్ లో లాంచ్ అయి సక్సెస్ అయినా అక్కడా ఇంత వరకూ మరో కొత్త ప్రాజెక్ట్ కమిట్ అవ్వలేదు. మరి అక్కడ అవకాశాలొచ్చినా రిజెక్ట్ చేస్తుందా? లేక ఛాన్సులు రాక చేయడం లేదా? అన్నది ఓ మిస్టరీ.