యూఎఇలో ఘనంగా గణతంత్ర వేడుకలు

Grand Republic celebrations in UAE

Jan 26, 2025 - 14:33
 0
యూఎఇలో ఘనంగా గణతంత్ర వేడుకలు

దుబాయ్​: యూఎఈలో ప్రవాస భారతీయులు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరుపుకున్నారు. ఆదివారం ఉదయం అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం, దుబాయ్​ లోని కాన్సులేట్​ లో ఆటపాటలు, సంప్రదాయ, సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సవాలను ప్రారంభించారు. భారతీయ జెండా చేతబూని ఇచ్చిన ప్రదర్శనలు ఔరా అనిపించాయి. ఈ వేడుకల్లో యూఎఇ భారత రాయబారి సంజయ్​ సుధీర్​ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. కాన్సులేట్​ కాన్సుల్​ జనరల్​ సతీష్​ కుమార్​ శివన్​ లు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం రాష్ర్టపతి ద్రౌపదీ ముర్మూ రిపబ్లిక్​ డే ప్రసంగాన్ని చదివి వినిపించారు. నాలుగు మిలియన్ల భారతీయులు యూఎఇలో ఉన్నారు.  ఈ సందర్భంగా సంజయ్​ సుధీర్​ మాట్లాడుతూ.. యూఎఇ–భారత్​ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వేగంగా విస్తరించడం హర్షణీయమన్నారు. పరస్పర విశ్వాసం, గౌరవం, నమ్మకాలతో సంబంధాలు మరింత విస్తృతం కానున్నాయని స్పష్టం చేశారు. 18 నెలల్లో భారత ప్రధాని మోదీ మూడుసార్లు యూఎఇ అధ్యక్షుడు మొహమ్మద్​ బిన్​ జాయెద్​ తో కలిశారని గుర్తు చేశారు. కాప్​ సదస్సుకు ప్రధాని మోదీ హాజరు కావడం ప్రపంచంలో ఎదుగుతున్న భారత్​ కు ఉదాహరణగా అభివర్ణించారు. అలాగే అబుదాబి ప్రిన్స్​ షేక్​ ఖలీద్​ బిన్​ మొహ్మద్​ అల్​ నహ్యాన్​ భారత పర్యటనను గురించి వివరించారు. యూఎఇ నుంచి విదేశీ మారక ద్రవ్యం పంపడంలో రెండో అతిపెద్ద సహకారంగా నిలుస్తుందన్నారు. గతేడాది 125 బిలియన్​ డాలర్లకు పైగా విదేశీ మారక ద్రవ్యం భారత్​ కు వచ్చిందని సంజయ్​ వివరించారు.