గణతంత్ర వేడుకల్లో మోదీ స్పెషల్​ లుక్​

Modi's special look at Republic celebrations

Jan 26, 2025 - 14:12
 0
గణతంత్ర వేడుకల్లో మోదీ స్పెషల్​ లుక్​

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ ధరించిన కుర్తా పైజామా సోషల్​ మీడియాలో ప్రశంసలను దక్కించుకుంటున్నాయి. ఎరుపు పసుపు, కుంకుమ రంగు తలపాగా, ముదురు గోధుమ రంగు  కోట్​ ధరించారు. 

2024: గత సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ ఈ సందర్భంగా ఆమె కుంకుమ, గులాబీ, తెలుపు, పసుపు రంగులతో కూడిన తలపాగా ధరించారు. తెల్లటి కాటన్ కుర్తా -పైజామా, బ్రౌన్ కలర్​ కోట్​ ను ధరించారు. 

2023: నారింజ, ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, తెలుపు రంగులతో కూడిన దుస్తులను ధరించారు.  ప్రధాని మోదీ తలపాగాను బ్రౌన్​ కలర్​ ధరించారు. 

2022: ప్రధాని మోదీ సంప్రదాయ కుర్తా, పైజామా, బూడిద రంగు చెక్-ఎంబ్రాయిడరీ జాకెట్‌ను ధరించారు. ఉత్తరాఖండ్ సాంప్రదాయ టోపీ, కండువా, బ్రహ్మ కమలం ప్రేరేపిత బ్రూచ్‌తో కనిపించారు. 

2021: జామ్​ నగర్​ రాజ కుటుంబం నుంచి బహుమతిగా అందిన తలపాగా ధరించారు. బూడిదరంగు జాకెట్​, తెలుపు కుర్తా, పైజామా, ఎంబ్రాయిడరీ షాల్​ ను ధరించారు. 

2020: కుర్తా, పైజామా, తలపాగాతో కూడిన జాకెట్ ధరించే సంప్రదాయాన్ని ప్రధాని మోదీ కొనసాగించారు. కుంకుమపువ్వు తలపాగా ధరించారు. 

2019: 2019లో ప్రధాని మోదీ పసుపు-నారింజ రంగులో ఎర్రటి రంగు తలపాగాను ధరించారు. బ్రౌన్ జాకెట్, క్రీమ్ కలర్ కుర్తా, పైజామను ధరించారు.