అమెరికా సెనెట్ లో రెండు చట్టాలకు ఆమోదం
నమ్మకం, విశ్వాసంలో ప్రపంచఖ్యాతిగాంచిన మోదీ ప్రభుత్వం
జీ–20 నిర్వహణతో ప్రపంచదేశాల చూపు భారత్ వైపు
చైనాకు ప్రత్యామ్నాయం భారతేనంటున్న బహుళజాతి సంస్థలు
చైనా నుంచి బిచాణ ఎత్తేస్తున్న సంస్థలు
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: చైనా దుందుడుకు నిర్ణయాలు భారత్ కు మేలు చేకూరుస్తున్నాయి. స్నేహ సంబంధాలు, మంచితనం, నమ్మకం, విశ్వాసమే భారత్ ను ప్రపంచదేశాల్లో మేటిగా నిలబెట్టడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచానికే పెద్దన్నగా భావిస్తున్న అమెరికా మరో పెద్ద నిర్ణయం తీసుకుంది. దీనివల్ల చైనాలోని బడా సంస్థలన్నీ భారత్ కు క్యూ కట్టనున్నాయి. ఒక్కొక్కటిగా చైనాకు ఝలక్ ఇవ్వనున్నాయి.
చైనా దుందుడుకు నిర్ణయాలు..
ఆంగ్ల దేశాలు కరోనా మహామ్మారి తరువాత చైనాపై పూర్తి విశ్వాసాన్ని కోల్పోయాయి. ఆ దేశాలకు అవసరమైన ఉత్పత్తులు మరే దేశంలో కానందున ఇన్నిరోజులు చైనా ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగింది. కానీ మోదీ నిర్ణయాల వల్ల పారిశ్రామిక రంగం బలోపేతమై, నూతన ఉత్పత్తుల్లో భారీగా పెరుగుదల నమోదవుతుండడంతో చైనాకు చెక్ పెట్టేదిశగా అమెరికా ముందువరుసలో ఉంది. ఇంకేం ప్రపంచ పెద్దన్న భారత్ ఉత్పత్తుల వైపు ఆకర్షితులయితే ఆ వెంట మరిన్ని దేశాలు భారత్ తోనే ఆయా ఉత్పత్తుల కొనుగోలు చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
భారత్ కు కలిసిరానున్న రెండు చట్టాలు..
యూఎస్ సెనెట్‌లో రెండు బిల్లులు ప్రవేశపెట్టారు. పీఎన్ టీఆర్ (శాశ్వత సాధారణ వాణిజ్య సంబంధాల స్థితి. ఒక విదేశీ దేశంతో స్వేచ్ఛా వాణిజ్యం కోసం యునైటెడ్ స్టేట్స్‌లో చట్టపరమైన హోదా), ఏఎన్ టీఈ (నాన్-మార్కెట్ టారిఫ్ ఎగవేషన్ ) చట్టాలు. ఈ చట్టాలు రష్యా, చైనా ఉత్పత్తులను ప్రపంచదేశాల్లో ఎగుమతి చేయడంపై కఠిన చర్యలతో కూడుకున్నది. అదే సమయంలో భారత్ కు ఈ చట్టాలు వరంగా మారనున్నాయి. చైనాకు ప్రత్యామ్నాయాలు వెతుకుతున్న బహుళ జాతి సంస్థలకు భారత్ ఆకర్షిస్తోంది. ఇదే భారత్ కు కలిసిరానుంది. దీంతో రాబోయే సమయంలో పెద్ద యెత్తున ప్రపంచదేశాల సంస్థలు భారత్ లో పెట్టబడులు పెట్టేందుకు సిద్ధపడుతూ, అదే సమయంలో చైనా నుంచి బిచాణా ఎత్తేసేందుకు సిద్ధమయ్యాయి.
కీలక సమయం సద్వినియోగంలో మోదీ సర్కార్ ముందంజ..
ఎలక్ర్టానిక్స్, మెషినరీ, టెక్స్ టైల్స్, సోలార్ ప్యానెల్స్, ఆహార ధాన్యాలు మైక్రో చిప్ లు, ఫోన్లు, ఆయుధాలు ఒక్కటేమిటి ఇలా అనేక రంగాల్లో భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. కీలక సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్న మోదీ ప్రభుత్వం జీ–20లాంటి పెద్ద సమావేశాలతో ప్రపంచదేశాలను ఆకర్షించడం కూడా విదేశీ సంస్థల ఆసక్తిగా కారణంగా నిలుస్తోంది. ఏది ఏమైనా భవిష్యత్ లో చైనా రంగం కుదేలయ్యేందుకు, భారత్ ఆర్థిక రంగం మూడోస్థానానికి ఎగబాకేందుకు ఎంతో సమయం పట్టేలా లేదు.