ఇరాన్ లో భూకంపం 4 మృతి
120మందికి గాయాలు
టెహ్రాన్: ఇరాన్ లో 4.9 తీవ్రతతో భూంకపం సంభవించింది. మంగళవారం సాయంత్రం రజావి ఖొరాసన్ ప్రావిన్స్ కశ్మీర్ కౌంటీలో భూకంపం సంభవించడంతో నలుగురు మృతిచెందగా, 120 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు ఐదు రెస్క్యూ బృందాలను సంఘటనా స్థలానికి పంపారు. భూకంపం సంభవించిన ప్రాంతంలో పలువురు నిరాశ్రయులవ్వడంతో వారికి పునరావాస చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ భూకంపంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.