రాళ్లదాడులు, కాల్పుల నుంచి విముక్తి
అభివృద్ధి, సంక్షేమానికే ప్రాధాన్యత శ్రీనగర్ ఎన్నికల సభలో కేంద్రమంత్రి అమిత్ షా
శ్రీనగర్: రాళ్లదాడులు, కాల్పులు గతంలో జరిగేవని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. తమ ప్రభుత్వంలో అభివృద్ధి, ప్రజాసంక్షేమమే ముఖ్యమన్నారు. అలాంటి దాడులకు ధీటుగా సమాధానం చెప్పి శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిని ఉపేక్షించబోమని అమిత్ షా అన్నారు. మంగళవారం జమ్మూలోని పలుడాలో జరిగిన బహిరంగ సభలో హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. రాష్ట్రంలో ఉగ్రవాదం తుది శ్వాస విడిచిందన్నారు. బీజేపీ తొలి జాతీయాధ్యక్షుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఇక్కడే ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు.
ప్రధాని మోదీ హయాంలో పదేళ్లలో జమ్మూ కశ్మీర్ అత్యధికంగా లబ్ధి పొందిందని షా పేర్కొన్నారు. ఒకప్పుడు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం ఇక్కడ ఫరిడవిల్లేదని అన్నారు. కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక యువత చేతుల్లో నుంచి రాళ్లు తొలగించగలిగామని వారి చేతుల్లో ఇప్పుడు ల్యాప్ టాప్ లు కనబడుతున్నాయని తెలిపారు. ఇది శుభపరిణామమని పేర్కొన్నారు.
'ఒకే దేశంలో ఇద్దరు విధాన్‌లు, ఇద్దరు ప్రధానులు, ఇద్దరు నిషాన్‌లు పనిచేయరు' అని శ్యామా ప్రసాద్ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తరువాత పరిస్థితుల్లో సమూల మార్పులు వచ్చాయని స్పష్టం చేశారు. ఇక్కడ త్రివర్ణ పతాకం ఎగరడం ఎంతో గర్వకారణమని చెప్పారు. క్లిష్ట సమయాల్లో కూడా ఇక్కడి ప్రజల వెంట బీజేపీ నిలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
మోహబూబా ముఫ్తీ, ఎన్ సీ పీడీపీలు ఎప్పుడే వారి స్వలాభాన్నే చూసుకొని ఇక్కడి ప్రజల మేలును మరిచిపోయాయని కానీ బీజేపీ ప్రభుత్వం రాష్ర్ట అభివృద్ధితోపాటు ఇక్కడి నిరుద్యోగం రూపుమాపాలని, పర్యాటక రంగానికి ప్రోత్సాహం, అభివృద్ధిని మాత్రమే కాంక్షించిందని కేంద్రమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.