ఢిల్లీలో కమ్ముకున్న పొగమంచు
Fog in Delhi
ఆలస్యంగా నడుస్తున్న వంద విమానాలు, 24 రైళ్లు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో చలితీవ్రత తీవ్ర ప్రభావం చూపుతుంది. శుక్రవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వంద విమానాలు, 24 రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఈ చలికాలంలో ఢిల్లీలో ఇంతపెద్ద యెత్తున దట్టమైన పొగమంచు కమ్ముకోవడం ఇది మూడోసారి. ఉదయం పూట రోడ్లు కనిపించక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపివేయాల్సి వస్తుంది. జాతీయ రహదారులపై లైట్లు వేసుకొని ప్రయాణిస్తున్నారు. ఉదయం 11 గంటల వరకు రూడ్లపై పెద్దగా వాహనాలు కనిపించడం లేదు. దృశ్యమానత భారీగా తగ్గడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.