చైనాలో ఇన్​ ఫ్లూయెంజా ఎ, హెచ్​ ఎంపీవీ వైరస్​ విజృంభణ

Influenza A and HMPV virus outbreak in China

Jan 3, 2025 - 13:22
 0
చైనాలో ఇన్​ ఫ్లూయెంజా ఎ, హెచ్​ ఎంపీవీ వైరస్​ విజృంభణ

అత్యవసర పరిస్థితి ప్రకటన?
విషయం బయటకు రాకుండా జాగ్రత్తలు

బీజింగ్​: కోవిడ్​ లాంటి వైరస్​ తరువాత చైనాలో మరో కొత్త వైరస్​ వ్యాప్తి ఆందోళన కలిగిస్తుంది. ఈ దేశంలో ఇన్​ ఫ్లూయెంజా ఎ, హ్యూమన్​ మెటాఫ్న్యూ వైరస్​ (హెచ్​ ఎంపీవీ) వైరస్​ వేగంగా వ్యాపిస్తోంది. ఈ వ్యాధి కారక వైరస్​ కోవిడ్​ లక్షణాలతో ఉండడం మరింత ఆందోళన కలిగిస్తుంది. చైనాలో ఈ వ్యాధిబారిన పడిన, అనుమానం ఉన్నవారితో పలు ఆసుపత్రులు కిటకిటలాడుతున్న దృశ్యాలు శుక్రవారం సోషల్​ మీడియా మాధ్యమంగా వెలుగుచూశాయి. 

ఈ వైరస్​ ఫ్లూ, న్యుమోనియా, ఊపిరితిత్తులపై ప్రభావం లాంటి వాటికి దారితీస్తుంది. దీంతో చైనా అత్యవస పరిస్థితిని కూడా ప్రకటించిందని తెలుస్తోంది. ఈ వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచదేశాలు చైనాపై ఓ కన్నేసి ఉంచాయి. కోవిడ్​ వైరస్​ చైనా నుంచి వచ్చిందని ఋజువయ్యాక చైనా అంటేనే ప్రపంచదేశాలు వణికిచస్తున్నాయి. ఈ వ్యాధిని, వైరస్​ ను ఎదుర్కొనేందుకు చైనా ఆరోగ్య శాఖ పెద్ద యెత్తున చర్యలు చేపట్టిందని, అదే సమయంలో ఈ విషయాన్ని బయటికి పొక్కనీయకుండా జాగ్రత్తలు తీసుకుందనే ఆరోపణలున్నాయి. ఇదే సమయంలో వ్యాధులు, వైరస్​ నియంత్రణ, నివారణకు చైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా కేసులు రోజురోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఏది ఏమైనా ఒకసారి కోవిడ్​ వ్యాధి చైనా నుంచే వ్యాప్తి చెందడంతో ప్రపంచదేశాల్లో సంక్షోభం కలకలం రేగిన విషయం విదితమే.