జమ్మూకశ్మీర్​ ఎన్నికలు డీపీఏపీ 13మందితో తొలి లిస్టు

Jammu and Kashmir Election DPAP first list with 13 people

Aug 25, 2024 - 19:15
 0
జమ్మూకశ్మీర్​ ఎన్నికలు డీపీఏపీ 13మందితో తొలి లిస్టు

శ్రీనగర్​: జమ్మూకశ్మీర్​ ఎన్నికలలో పోటికి 13 మందితో కూడిన తొలి లిస్టును డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) ఆదివారం విడుదల చేసింది. గులాంనబీ ఆజాద్​ స్థాపించిన డీపీఏపీ తొలిసారిగా జమ్మూకశ్మీర్​ అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొంటుంది. దోడా తూర్పు నుంచి అబ్దుల్​ మజీద్​ వానీ, భద్వారా నుంచి మహ్మద్​ అస్లాం గోని, దురు నుంచి మునీర్​ అహ్మద్​, అనంత్​ నాగ్​ వెస్ట్​ నుంచి బిలాల్​ అహ్మద్​, రాజ్​ పోరా నుంచి గులాం నబీ వానీ, అనంత్​ నాగ్​ నుంచి అల్తాఫ్​ హుస్సేన్​, గందర్​ బల్​ నుంచి కైజర్​ సుల్తాన్​, ఈద్గా నుంచి గులాం నబీ భరత్​, కన్యార్​ నుంచి నిసార్​ అహ్మద్​, గురేజ్​ నుంచి నిస్సార్​ అహ్మద్​, హజరత్​ బాల్​ నుంచి పీర్​ అహ్మద్​ బిలాల్​ లను రంగంలోకి దింపుతున్నట్లు తెలిపింది.