ఎయిర్​ ఇండియా విమానంలో మంటలు

185 మంది సురక్షితం కుడి ఇంజిన్​ లో సాంకేతిక లోపం పైలెట్​ అప్రమత్తత వల్లే తప్పిన ముప్పు

May 19, 2024 - 14:25
 0
ఎయిర్​ ఇండియా విమానంలో మంటలు

బెంగళూరు: బెంగళూరు నుంచి కొచ్చి వెళుతున్న ఎయిర్​ ఇండియా ఎక్స్​ ప్రెస్​ విమానం (ఐఎక్స్​–1132)లో శనివారం అర్థరాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని అత్యవసరంగా  బెంగళూరు విమానాశ్రయంలో ల్యాండింగ్​ చేశారు. విమానంలో 179 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. సురక్షితంగా విమానం ల్యాండ్​ కావడంతో అధికారులు ఉపిరి పీల్చుకున్నారు.  అర్థరాత్రి విమానం టేకాఫ్​ కాగానే మంటలను పైలెట్​ గుర్తించి సకాలంలో సమాచారం అందించి సురక్షితంగా ల్యాండ్​ చేశాడని అధికారులు తెలిపారు. వెంటనే ప్రయాణికులను సురక్షితంగా కిందకు దింపుతూనే విమానంలో మంటలు చెలరేగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తులో విమానం కుడి ఇంజిన్​ లో మంటలు చెలరేగాయన్నారు. ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నామని ఎయిర్​ ఇండియా అధికారులు స్పష్టం చేశారు.