ఆర్టీసీ బస్సులో మంటలు

డ్రైవర్​, ప్రయాణికుల అప్రమత్తతో తప్పిన ముప్పు

Jun 11, 2024 - 17:48
 0
ఆర్టీసీ బస్సులో మంటలు

నా తెలంగాణ, డోర్నకల్: డోర్నకల్​ నుంచి ఖమ్మం వెళుతున్న ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సకాలంలో స్పందించడంతో ఘోర ప్రమాదం తప్పింది. మంగళవారం డోర్నకల్​ నుంచి ఏపీ36జడ్​–0067 బస్సు ప్రయాణిస్తోంది. ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్​, ప్రయాణికులను వెంటనే కిందకు దింపి వారి సహాయంతో మంటలను ఆర్పివేశారు. దీంతో ప్రమాదం తప్పింది. కాగా కేబుల్​ వైర్లు షార్ట్​ సర్క్యూట్​ కావడంతో బస్సులో మంటలు చెలరేగాయి.