విదేశాంగ విధానంలో నారీశక్తి కీలకం

కేంద్రమంత్రి ఎస్​. జై శంకర్​

Jan 10, 2025 - 19:25
 0
విదేశాంగ విధానంలో నారీశక్తి కీలకం

భువనేశ్వర్​: భారత విదేశాంగ విధానానికి మహిళల నేతృత్వం అభివృద్ధికి కేంద్రంగా మారిందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్​. జై శంకర్​ అన్నారు. ఒడిశా భువనేశ్వర్​  జనతా మైదాన్​ లో18వ ప్రవాసీ భారతీయ దివస్​ కన్వెన్షన్​ లో సెలబ్రేటింగ్​ ఉమెన్స్​ లీడర్​ షిప్​ అండ్​ ఇన్​ ఫ్లూయెన్స్​ నారీశక్తి అనే అంశంపై విదేశాంగ మంత్రి జై శంకర్​ పాల్గొని ప్రసంగించారు. వికసిత్​ భారత్​ విజన్​ లో మహిళల పాత్రను నొక్కి చెప్పారు. జీ–20లో కూడా మహిళల పాత్ర కీలకమైనదని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మహిళా నేతృత్వానికి, అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. సమ్మిట్​ ఆఫ్​ ది ఫ్యూచర్​ లో కూడా నారీ శక్తి భావనను చాటి చెప్పామని మంత్రి అన్నారు. మహిళల పురోగతికి ఆటంకం కలిగించే సామాజిక పక్షపాతాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. పోషకాహారం, ఆరోగ్యం, విద్య, వైద్యం వంటి వాటిలో నారీ శక్తి పాత్ర మరింత విస్తరించాల్సి ఉందన్నారు. ఇప్పటికే విస్తరణ ప్రారంభమైందన్నారు. మహిళలపై వివక్ష పుట్టుకతోనే ప్రారంభం కావడం దురదృష్టకరమన్నారు. తమ ప్రభుత్వం ఈ వివక్షను పూర్తిగా రూపుమాపే చర్యలను చేపట్టిందన్నారు. ఈ దిశలో సామాజిక మార్పు చేపట్టామని మంత్రి జైశంకర్​ తెలిపారు.