దృఢమైన రక్షణ వ్యవస్థ అవసరం
కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశ స్వావలంభన కోసం దృఢమైన రక్షణ వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. న్యూ ఢిల్లీ ఏరో ఇండియా–2025కి ముందు అంబాసిడర్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి రాజ్ నాథ్ సింగ్ తన అభిప్రాయాలను పంచుకున్నారు.
పర్యావరణ మెరుగుదల, సాంకేతిక సహకారం పెంపొందించడంపై దృష్టి సారించాలన్నారు. అదేసమయంలో పారిశ్రామిక పర్యావరణను పటిష్ఠంగా వ్యవస్థను రూపొందించడానికి విధానపరమైన సంస్కరణలను ప్రభుత్వం చేస్తుందన్నారు. నాలుగోతరం యుద్ధ విమానాలు, అణు జలాంతర్గాములు, యుద్ధ ట్యాంకులు, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని భారత్ కలిగి ఉందన్నారు. సీ–295 విమానాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం రక్షణ రంగంలో అంతర్జాతీయ సహకారాన్ని మరింత పెంపొందించేందుకు నిదర్శనమన్నారు. రక్షణ రంగం ఏరోస్పేస్ లో అపార అవకాశాలు ఉన్నాయన్నారు.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను తగ్గించేందుకు అన్ని దేశాలు కలిసి పనిచేయాలని, భవిష్యత్ తరాలు ఆర్థిక వృద్ధి, సాంకేతిక పురోగతి నుంచి ప్రయోజనం పొందేలా చూడాలని పిలుపునిచ్చారు. ఏరో ఇండియా–2025 ఈవెంట్ రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యాలు, సైనిక సహకారం, వ్యాపార సహకారాన్ని అన్వేషించేందుకు ప్రపంచవ్యాప్త వాటాదారులకు ఒక వేదిక కాగలదన్నారు. ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌షో అయిన ఏరో ఇండియా, అధునాతన ఏరోస్పేస్, డిఫెన్స్ టెక్నాలజీలను ప్రదర్శిస్తూ ప్రీమియర్ ఇంటర్నేషనల్ ఈవెంట్‌గా మారిందని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.