బంగ్లా సచివాలయంలో అగ్నిప్రమాదం
Fire in Bunglow Secretariat
విచారణకు దర్యాప్తు కమిటీ ఏర్పాటు
ఏడో అంతస్థులో కీలక పత్రాలు
ఢాకా: బంగ్లాదేశ్ ఢాకాలోని ప్రభుత్వ సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం ఉదయం భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ వెంటనే రంగంలోకి దిగి ఆరు గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. సచివాలయంలోని ఏడో అంతస్తు పూర్తిగా బుగ్గి పాలైనట్లు సమాచారం. కాగా ఈ అగ్నిప్రమాదంపై ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. ఎవరైనా కావాలనే చేశారని ప్రభుత్వం భావిస్తుంది. అత్యంత విలువైన సమాచారం ఉన్న ఏడో అంతస్థులోనే మంటలు అంటుకోవడంపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని విచారణకు నియమించింది. కాగా అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. ఈ అంతస్థులో షేక్ హసీనా హయాంలో జరిగిన నిర్ణయాలు, కాంట్రాక్టులకు సంబంధించిన విలువైన పత్రాలున్నాయని ప్రభుత్వ సలహాదారు ఆసిఫ్ మహమూద్ సజీబ్ భుయాన్ ప్రకటించారు. కాగా అగ్నిప్రమాదం పేరుతో మరో కుట్రకు తాత్కాలిక యూనస్ ప్రభుత్వం తెరతీస్తుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.