ఎన్డీయేతో నడిచేందుకు 12మంది ఆర్జేడీ నేతలు సిద్ధం
కేంద్రమంత్రి జితిన్ రామ్ మాంఝీ
పాట్నా: ఎన్డీయేతో ఆర్జేడీకి చెందిన 12మంది నాయకులు కలిసి నడిసేందుకు సిద్ధంగా ఉన్నారని కేంద్రమంత్రి జితిన్ రామ్ మాంఝీ అన్నారు. గురువారం ఆయన మీడియాతో ముచ్చటించారు త్వరలోనే వారంతా సీఎం నితీశ్ కుమార్ నాయకత్వంలో ఎన్డీయేతో కలిసి నడవబోతున్నారన్నారు. కొన్ని పార్టీలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. నితీశ్ కుమార్ బిహార్ పాలన సుభిక్షంగా కొనసాగుతుందన్నారు. ఎన్డీయే పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి పోటీ చేయబోతుందని విజయం సాధిస్తామని నమ్మకం వ్యక్తం చేశారు. తేజస్వి యాదవ్ విమర్శలను తిప్పికొట్టారు. బిహార్ తేజస్వీ పార్టీ పాలనలో ఏం జరిగిందనేది దేశానికంతటికి తెలుసన్నారు. వారిదంతా అవినీతి, అక్రమ పాలనే అని పలు విమర్శలు గుప్పించారు.