పాక్ అణు ప్రయోగాలకు చెక్
A check on Pakistan's nuclear tests
రంగంలోకి ఇండియన్ జేమ్స్ బాండ్
క్వాడ్ సమావేశంలోనే ఆధారాలతో సహా వివరాలు అమెరికాకు అప్పగింత
పాక్, చైనా, బంగ్లా వెన్నులో వణుకు
పాక్ మూడు, చైనా 10 సంస్థలపై అమెరికా ఆంక్షలు
ఇజ్రాయెల్, అమెరికా, భారత్ పై దాడులకు భారీ ప్లాన్
కీలకాధారాలు సంపాదించిన ధోవల్ బృందం
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: పాక్, బంగ్లా, చైనా కుట్రలను భారత్ కుండబద్ధలు కొట్టింది. ఫలితంగానే పాక్ అణు ప్రయోగాలపై అమెరికా ఆంక్షలు విధించింది. దీంతో ఆయా దేశాల నుంచి పాక్ భారీ ఆయుధ తయారీకి వినియోగించే ముడిసరుకులపై ఆంక్షల వల పనిచేయనుంది. ఇటీవలే అమెరికా విధించిన ఈ ఆంక్షల వెనుక పాక్ భారీ కుట్ర దాగి ఉందనేది వాస్తవమని నిరూపితమైంది. ఇంతకీ ఈ కుట్రను భారత్ ఎలా చేధించగలిగింది? ద వన్ అండ్ ఓన్లీ ‘ఇండియన్ జేమ్స్ బాండ్’గా పేరొందిన అజిత్ ధోవల్ బృందం ఈ కుట్రకు సంబంధించిన కీలక సమాచారాన్ని రాబట్టింది. సేకరించిన వివరాల ప్రకారం.. పాక్, బంగ్లా, చైనాలు భారీ ఆయుధ సంపత్తిని పోగేసుకొని అమెరికా, భారత్, ఇజ్రాయెల్ లపైన నేరుగా దాడి చేయాలనే ఉద్దేశ్యాన్ని కలిగి ఉన్నాయి.
నీళ్లు నమిలిన పాక్..
ఇదే విషయాన్ని ఆధారాలతో సహా భారత విదేశాంగ శాఖ మంత్రి క్వాడ్ సమావేశంలో వివరాలను, సాక్ష్యాలను నేరుగా అమెరికాతో పంచుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన అమెరికా గూడాఛార సంస్థలు భారత్ సమర్పించిన నివేదికలోని అంశాలు నిజమేనని తెలుసుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు సమాచారం అందజేశాయి. మరోవైపు పాక్ కూడా ఇదే సమయంలో అణుసామర్థ్యాన్ని రెట్టింపు చేసుకోవాలని భావించింది. కానీ ఆ విషయాన్ని దాచి క్వాడ్ సమావేశంలో తాము అంతరిక్ష పరిశోధనల కోసం ముడిసరుకులను తెప్పించుకున్నట్లు అమెరికాకు బుకాయించింది. భారత్ నివేదిక, అమెరికా విశ్లేషణల తరువాత అమెరికా బృందం ఒకటి పాక్ కు వెళ్లింది. పాక్ చెబుతున్నట్లు అంతరిక్ష పరిశోధనలపై ఆరాతీసింది. ఇదంతా ఒత్తిడే అని గుర్తించింది. దీంతో పాక్ నీళ్లు నమిలింది.
ఇజ్రాయెల్ పై దాడికి ప్లాన్!..
ఇస్లామిక్ దేశాలపై ఇజ్రాయెల్ చేస్తున్న నరమేధాన్ని సిరియా, ఇరాన్, టర్కీ, చైనా, బంగ్లాలతో కలిసి ఆయుధ సంపత్తి కూడగట్టుకొని నేరుగా అమెరికా, ఇజ్రాయెల్ పై దాడులకు వినియోగించాలని పాకిస్థాన్ భావించింది. కానీ పాక్ కు ఇరాన్ కు అస్సలు పడకపోవడంతో ఈ ప్రణాళిక నుంచి ఇరాన్ తను తప్పించింది. చాపకింద నీరులా ఎవ్వరికి తెలియదనుకొని తన ప్రయత్నాలను ప్రారంభించింది. కానీ పాక్, బంగ్లా, టర్కీ, చైనా, సిరియా లాంటి దేశాలపై ఓ కన్నేసి ఉంచిన ఇండియన్ జేమ్స్ బాండ్ బృందం అంతర్గత విషయాలను ఆధారాలతో సహా బయటకు లాగింది. దీంతో రహాస్యాలు కాస్త బట్టబయలు చేసింది.
అంతర్మథనంలో బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం..
పాక్ అణు సామర్థ్యాన్ని సాధించే ప్రయత్నంలో నేషనల్ డెవలప్ మెంట్ కాంప్లెక్స్ తోపాటు అక్తర్ అండ్ బ్రదర్స్, రాక్ ఎంటర్ ప్రైజెస్ లాంటి ఉగ్ర సంస్థలు కూడా పాలుపంచుకుంటున్నాయి. ఈ మూడు సంస్థలపై అమెరికా నిషేధం విధించడంతోపాటు చైనాకు చెందిన 10 సంస్థలపైనే ఆంక్షలను విధించింది. దీంతో పాక్ అణుసామర్థ్యాన్ని దూరశ్రేణుల క్షిపణుల లక్ష్యాలను సాధించే సాంకేతికతలో విజయం సాధిస్తే భారత్ పై దాడి చేయాలని ఉవ్విళూరుతున్న బంగ్లాకు కూడా చెక్ పడింది. అమెరికా ఆంక్షలతో బంగ్లా, చైనాల్లోనూ వణుకు మొదలైంది. ఈ నేపథ్యంలోనే పాక్, బంగ్లాదేశ్ తో కలిసి భారత్ ను ఇరకాటంలోకి నెట్టాలనే చర్యలకు పాల్పడుతున్నాయి. కానీ భారత్ కర్ర విరగకుండా పామును చంపే చాణక్య నీతిని ఎప్పుడో రూపొందించుకొని ఆయా దేశాల రాజకీయ నీతి ప్రకారం యుద్ధం లేకుండానే ఆయా దేశాలను ఓటమి పాలు చేస్తుంది. ఇదంతా మోదీ సూదూర దూరదృష్టి వల్లే సాధ్యమవుతుంది. మరోవైపు బంగ్లాలో మైనార్టీలైన బుద్ధులపై దాడి చేయడాన్ని మయన్మార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న 40వేల ఆర్మీ సిద్ధమైంది. బంగ్లాలో తమవారిని కాపాడుకోవాలని బయలుదేరింది. ఈ పరిణామాలు కూడా బంగ్లాలో అంతర్మథనంలో పడవేస్తున్నాయి. బంగ్లా మరింత ముందుకు వెళితే వారి పతనం నిశ్చయమే అనే దిశగా పరిణామాలు ఎదురవుతున్నా పాక్ ను నమ్ముకున్న బంగ్లా మరిన్ని అడుగులు ముందుకు వేసుకుంటూ ముందుకు వెళుతుంది. భారత్ చేసిన సహాయాన్ని మరిచిపోయిందీ నమ్మకద్రోహి, మిత్రద్రోహి దేశం. ఇప్పుడు తాజాగా బంగ్లా సైన్యం పాక్ ఆర్మీతో శిక్షణ పొందనుందనే వార్త బయటకు వస్తుంది.