ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు

కుప్వారాలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం

Jun 3, 2024 - 15:13
 0
ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు

కాశ్మీర్​: పూల్వామాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలను మధ్య సోమవారం ఉదయం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. ఇంటెలిజెన్స్​ సమాచారం మేరకు భద్రతా దళాలు ఉగ్రవాదులు దాక్కున్న స్థావరాన్ని చుట్టుముట్టారు. కాగా ఎంతమంది ఉన్నారనే వివరాలు తెలియలేదు. ఇరువైపుల నుంచి కాల్పుల నేపథ్యంలో ఉగ్రవాదులు ఉన్న ఇంటిలో మంటలు చెలరేగాయి. చుట్టుపక్క ప్రాంతాలకు మంటలు పాకగుండా ఓ వైపు చర్యలు తీసుకుంటూనే ఆ ఇంటిని భద్రతా దళాలు చుట్టుముట్టాయి. 
మరోవైపు కుప్వారాలో పోలీసులు, ఆర్మీ చేపట్టిన సంయుక్త ఆపరేషన్​ లో భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.