భారత్​ కు 297 పురాతన వస్తువుల అప్పగింత

జో బైడెన్​ కు మోదీ కృతజ్ఞతలు

Sep 22, 2024 - 19:14
 0
భారత్​ కు 297 పురాతన వస్తువుల అప్పగింత
వాషింగ్టన్​: క్వాడ్​ సదస్సులో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా శుభవార్త చెప్పింది. భారత్​ కు సంబంధించిన 297 అత్యంత పురాతన వస్తువులను అందజేస్తామని ఆదివారం ప్రకటించింది. 2023 ఇరుదేశాల ఒప్పందం ప్రకారం ఈ చర్యలు తీసుకుంది. డిపార్ట్‌మెంట్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అఫైర్స్, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వం జూలై 2024లో సాంస్కృతిక ఆస్తి ఒప్పందంపై సంతకం చేసింది. ఈ సందర్భంగా సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించేందుకు ఇరుదేశాలు నిబద్ధతో పనిచేస్తున్నాయన్నాయని ఆయా శాఖల ఉన్నతాధికారులు తెలిపారు. 
 
ఈ పురాతన వస్తువులన్నీ భారత్​ నుంచి అక్రమ రవాణా, దొంగతనాల ద్వారా దేశం దాటాయి. వీటిని తిరిగి భారత్​ కు తీసుకువచ్చేందుకు మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ కళాఖండాలను ప్రధాని మోదీతో కలిసి ఆదివారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ లు తిలకించారు. ఇవే భారత్​ కు తిరిగి అప్పగించనుంది. వస్తువుల అప్పగింతపై జో బైడెన్​ కు ప్రధాని నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. 
 
ఏయే వస్తువులున్నాయి?..
 
టెర్రకోట కళాఖండాలు, రాయి, లోహం, కలప, దంతాలతో తయారు చేసిన పురాతన ఉత్పత్తులు. 
 
10-11వ శతాబ్దానికి చెందిన రాయితో రూపొందిన అప్సర శిల్పం.
 
15-16వ శతాబ్దానికి చెందిన కాంస్యంతో రూపొందించిన జైన తీర్థంకర్ శిల్పం.
 
3-4వ శతాబ్దానికి చెందిన తూర్పు టెర్రకోట వాసే శిల్పం.
 
1వ శతాబ్ధానికి చెందిన రాతి శిల్పం.
 
17-18వ శతాబ్దానికి చెందిన కంచుతో రూపొందించిన వినాయక విగ్రహం. 
 
15-16వ శతాబ్దానికి చెందిన ఉన్న బుద్ధుడి విగ్రహం.
 
17-18వ శతాబ్దానికి చెందిన కంచుతో రూపొందించిన విష్ణువు విగ్రహం. 
 
1800 సంవత్సరానికి చెందిన రాగితో రూపొందించిన ఆంత్రోపోమోర్ఫిక్ బొమ్మ.
 
17,18వ శతాబ్ధానికి చెందిన కాంస్యతో రూపొందించిన శ్రీకృష్ణుడి విగ్రహాలు.
 
13, -14వ శతాబ్దానికి చెందిన గ్రానైట్​ తో రూపొందించిన కార్తికేయుడి విగ్రహం. 
 
2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా 10 పురాతన వస్తువులను తీసుకురాగలిగారు. 2021లో 157 వస్తువులు, 2024 జూన్​ లో 105 పురాతన విగ్రహాలు, వస్తువులను తీసుకురాగలిగారు. దీంతో భారత చరిత్రను సంపూర్ణంగా అర్థం చేసుకునేందుకు చరిత్రకారులకు అవకాశం దక్కనుంది.