ఉపాధి కల్పన గత పదేళ్లలో 36 శాతం వృద్ధి

Employment generation has grown by 36 percent in the last ten years

Jan 2, 2025 - 17:49
 0
ఉపాధి కల్పన గత పదేళ్లలో 36 శాతం వృద్ధి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: గత పదేళ్లలో దేశంలో ఉపాధి కల్పన 36 శాతం వృద్ధిని సాధించిందని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2014 నుంచి 2024 ఉపాధి కల్పనపై గురువారం నివేదిక వెల్లడించింది. 4.60 కోట్ల ఉద్యోగాల కల్పన జరిగిందని తెలిపింది. 17 కోట్లకు పైగా అదనపు ఉద్యోగాలు సృష్టించినట్లు తెలిపింది. 2004 నుంచి 2014 వరకు 7 శాతం మాత్రమే వృద్ధి నమోదైనట్లు పేర్కొంది. 2014 నుంచి 2024 మధ్య ఈ వృద్ధి గణనీయంగా మెరుగుపడినట్లు స్పష్టం చేసింది. ఉపాధి కల్పన మెరుగ్గా ఉందని తెలిపింది. యూపీయే హయాంలో 2.90 కోట్ల అదనపు ఉద్యోగాలు లభించాయి. 

మోదీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగంలో 19 శాతం, తయారీ రంగంలో 15 శాతం, సేవా రంగంలో 36 శాతం ఉపాధి అవకాశాలు పెరిగాయని నివేదిక వెల్లడించింది. మంత్రిత్వ శాఖ ప్రకారం నిరుద్యోగిత రేటు 2017–-18లో 6 శాతం నుంచి 2023–-24లో 3.2 శాతానికి తగ్గింది. 2013లో గ్రాడ్యుయేట్‌ యువత ఉపాధి కల్పన 33.95 శాతం నుంచి 2024లో 54.81 శాతానికి పెరిగిందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. గత ఏడేళ్లలో 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయసున్న నాలుగు కోట్ల 70 లక్షల మంది యువత ఈపీఎఫ్‌వోలో చేరినట్లుగా స్పష్టం చేసింది.