భారత్–మయన్మార్ సరిహద్దు 9కి.మీ. ఫెన్సింగ్ పూర్తి
India-Myanmar border is 9 km. Fencing is complete
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్–మయన్మార్ సరిహద్దులో 9 కి.మీ. పైగా ఫెన్సింగ్ పూర్తి చేసినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. గురువారం నివేదిక విడుదల చేసింది. నివేదిక ప్రకారం మణిపూర్ లో మోరే వద్ద ఫెన్సింగ్ ఏర్పాటు, కంచె వెంట రహదారి పనులు పురోగతిలో ఉన్నాయి. 21 కి.మీ. మేర కంచె, రహదారి నిర్మాణ పనులను బోర్డర్ రోడ్ అండ్ ఆర్గనైజేషన్ కు అప్పగించారు. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం మీదుగా మయన్మార్‌తో దేశం 1,643 కి.మీ పొడవైన సరిహద్దును పంచుకుంటుంది. 1,643 కిలోమీటర్ల సరిహద్దులో, 1,472 కిలోమీటర్ల సరిహద్దుల విభజన పూర్తయిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్‌లలో హైబ్రిడ్ నిఘా వ్యవస్థ రెండు పైలట్ ప్రాజెక్ట్‌ల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.