మైనర్ బాలికపై లైంగిక వేధింపులు కాంగ్రెస్ అభ్యర్థి కుమారుడు ఉజ్వల్ అరెస్ట్
ఎంపీ అభ్యర్థి మనోజ్ పై కేసు నమోదు
పాట్నా: బిహార్ ససారం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మనోజ్ రాయ్, అతని కుమారుడు ఉజ్వల్ కుమార్ ను పోలీసులు లైంగిక వేధింపుల కేసులో శనివారం అరెస్టు చేశారు. ఉజ్వల్ తో సహా మరో నలుగురు మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడినట్లు ఏప్రిల్ 8వ తేదీనే ఎఫ్ ఐఆర్ నమోదైనా పోలీసులు పట్టించుకోకపోవడంతో బాలిక తండ్రి కైమూర్ ఎస్పీకి ఈ విషయాన్ని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఎస్పీ ఘటనపై విచారణకు ఆదేశించారు. వేధింపుల విషయం నిజమేనని రూఢీ చేసుకున్నాక శనివారం ఉజ్వల్ తోపాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఇదే విషయాన్ని మనోజ్ రాయ్ కు కూడా బాలిక తండ్రి గతంలోనే వెల్లడించిన ఆయన పట్టించుకోలేదని ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులకు తెలియజేయకపోవడం, నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నించడం కింద మనోజ్ రాయ్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.