పీఎం, సీఎంలు కలిస్తే తప్పుగా భావించొద్దు

సుప్రీం సీజైఐ డి.వై. చంద్రచూడ్​

Oct 27, 2024 - 12:22
 0
పీఎం, సీఎంలు కలిస్తే తప్పుగా భావించొద్దు

యూఎస్​ లో యేడాదికి 181 కేసుల పరిష్​కారం
భారత్​ లో యేటా 50వేల కేసుల పరిష్​కారం!
న్యాయవ్యవస్థకూ బడ్జెట్​ అవసరమే
తమ పనితీరుపై ప్రభావం చూపవు

ముంబాయి: ఉన్నత స్థానంలో ఉన్న రాజకీయ నాయకులు న్యాయమూర్తులను కలవడం ఒక ఒప్పందంగా భావించొద్దని సుప్రీంకోర్టు సీజేఐ డి.వై. చంద్రచూడ్​ అన్నారు. ఆదివారం ముంబాయిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. పీఎం, సీఎంలు, రాజకీయ నేతలను న్యాయమూర్తులు కలిస్తే ఏదైనా ఒప్పందం కుదిరిందని భావిస్తున్నారని అది తప్పని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి న్యాయవ్యవస్థకు కూడా బడ్జెట్​ అవసరం ఉంటుందని తెలిపారు. యూఎస్​ లో సగటున ఏడాదిలో 181 పరిష్కరిస్తే అదే భారత్​ లో 50వేల కేసులను పరిష్కరిస్తున్నామని తెలిపారు. న్యాయమూర్తుల సెలవులు, కొలీజియం వ్యవస్థలకు సంబంధించి ఎన్నో రకాల నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కేసుల పరిష్కారం, న్యాయవ్యవస్థ నడిచేందుకు కూడా బడ్జెట్​ అవసరం అవుతుందని చెప్పారు. కేవలం అక్షరాలపై ఆధారపడితే ఏ పని జరగదన్నారు. తనతో ఏ రాజకీయ నాయకులు భేటీ అయినా, కలిసినా కేసుల గురించి తన కెరీర్​ లోనే మాట్లాడలేదన్నారు. కోర్టు పరిపాలన, ఆర్థికానికి సంబంధించే చర్చించామన్నారు. పండుగలు, పబ్బాలు, సంతాప సమయాల్లో న్యాయమూర్తులను కలుసుకుంటారన్నారు. ఇది తమ పనితీరును ఎన్నటికీ ప్రభావం చేయబోదని స్పష్టం చేశారు. 

కోర్టుపై అత్యధిక పనిభారం ఉంటుందని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. కేసుల గురించి ఆలోచించడానికే సమయం కావాల్సి ఉంటుందన్నారు. ప్రజల నిర్ణయాలు సమాజ భవిష్యత్తును నిర్ణయిస్తాయన్నారు. తాను వేకువజామున 3.30 గంటలకే నిద్రలేచి ఉదయం 6 గంటలకే పనిని ప్రారంభిస్తానని చెప్పారు. 

మనం సృష్టించిన సంస్థను విమర్శించడం చాలా సులభమని, ప్రతి సంస్థలో అభివృద్ధికి అవకాశం ఉంది, కానీ ప్రాథమికంగా ఏదో తప్పు ఉందని మనం భావించొద్దన్నారు. ఈ సంస్థలు 75 ఏళ్లుగా నడుస్తున్నాయి. మన ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థను మనం విశ్వసించాలి, న్యాయవ్యవస్థ కూడా అందులో భాగమే అని జస్టిస్​ చంద్రచూడ్​ వివరించారు.