మోసాలు, అబద్దాలను నమ్మరు దేశాభివృద్ధికి మోదీ, అమిత్ షాల కృషి స్పీకర్ ఓం బిర్లా
Don't believe frauds and lies Speaker Om Birla
జైపూర్: ప్రతిపక్షాల మోసాలు, అబద్ధాలను ఓటర్లు నమ్మబోరని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. శుక్రవారం ఆయన ఎంపీగా పోటీ చేస్తున్న కోటా నియోజకవర్గం నుంచి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలు దేశాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని వివరించారు. రాజస్థాన్ లోని 25 స్థానాలను కైవసం చేసుకుంటామని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. బీజేపీ నేతృత్వంలో ప్రజలందరికీ సమన్యాయం పాటిస్తామని, సామాజిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని ఆయన పేర్కొన్నారు.