రసాయన శాస్త్ర సదస్సుకు కలెక్టర్​ కు ఆహ్వానం

Invitation to Chemistry Conference Collector

Jun 22, 2024 - 18:03
Jun 22, 2024 - 18:06
 0
రసాయన శాస్త్ర సదస్సుకు కలెక్టర్​ కు ఆహ్వానం

నా తెలంగాణ, నిర్మల్: నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 28, 29 తేదీల్లో రసాయన శాస్త్ర విభాగంలో జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా కలెక్టర్ అభిలాష అభినవ్ ను నిర్వాహకులు శనివారం ఆహ్వానించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జె బీమా రావు, అధ్యాపక బృందం కలెక్టర్ కార్యాలయంలో ఆహ్వానం అందచేశారు. "సుస్థిర అభివృద్ధి లో రసాయన, అనుబంధ శాస్త్రాల పాత్ర" అనే అంశంపై రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఇందులో వివిధ రాష్ట్రాల విశ్వవిద్యాలయాల, డిగ్రీ కళాశాలలకు చెందిన అధ్యాపకులు తమ పరిశోధన పత్రాలను సమర్పించనున్నారు. అలాగే వారు కనుగొన్న నూతన ఆవిష్కరణలను కూడా సమర్పించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆర్థిక సహాయంతో జరిగే ఈ సదస్సు కోసం 65 పరిశోధన పత్రాలు అందినట్లు సదస్సు కో ఆర్డినేటర్ సరితా రాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో అరుణ్ కుమార్, పిజి రెడ్డి, రవి కుమార్, సరితా రాణి, శ్రీహరి, శంకర్, రజిత తదితరులు పాల్గొన్నారు.