మూఢనమ్మకాలను నమ్మ వద్దు

డీబీఎఫ్  జిల్లా కార్యదర్శి దయాసాగర్ వాటికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరచాలి

Oct 9, 2024 - 19:20
 0
మూఢనమ్మకాలను నమ్మ వద్దు

నా తెలంగాణ, మెదక్: మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా  ప్రజలను చైతన్య పరచాలని జిల్లా ఎస్పీకి దళిత బహుజన ఫ్రంట్ జిల్లా కార్యదర్శి హన్మకొండ దయాసాగర్  విజ్ఞప్తి చేశారు. బుధవారం జిల్లా ఎస్సీ ఉదయ్ కుమార్ రెడ్డి ని తన కార్యాలయం లో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా హన్మకొండ దయాసాగర్ మాట్లాడుతూ, ఇటివల కాట్రియల్ గ్రామంలో మూఢనమ్మకాల పేరుతో దళిత మహిళ ద్యాగల ముత్తవ్వను సజివదహనం చెసిన వారిపై చెత్త పరంగా కఠినంగా శిక్షించాలని కోరారు. మూఢనమ్మకాల నిర్మూలన చట్ట సాధన కమిటీ అధ్వర్యంలో మంత్రాల, చెతబడులు,మూఢనమ్మకాల పై వైజ్ఞానిక సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రచారం నిర్వహిస్తామన్నారు. దసరా తరువాత 50 గ్రామాలలో  చైతన్య కార్యక్రమాలు నిర్వహిద్దామని ఎస్పీ హామీ ఇచ్చారని తెలిపారు.