హిండెన్ బర్గ్ కాంట్రాక్టు దక్కిందా?
Did Hindenburg get the contract?
రాహుల్ ది నక్సల్స్ భావజాలం
నిలదీసిన బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రాహుల్ గాంధీ పూర్తి నక్సల్స్ భావజాలంతో ఉన్నట్లుగా కనిపిస్తున్నారని హిండెన్ బర్ ఆరోపణలపై ఇప్పుడు మాట్లాడరెందుకని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ నిలదీశారు. ఆర్ఎస్ఎ, బీజేపీ ప్రధాని మోదీని విమర్శించడమే ఆయన పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఆయన ఆలోచనా విధానం సిగ్గుచేటన్నారు. ఓ వైపు హిండెన్ బర్గ్ మూసివేస్తుంటే మరోవైపు ఆ కాంట్రాక్టు రాహుల్ కు దక్కిందా? అని నిలదీశారు. దేశభక్తి గల పార్టీలను, వ్యక్తులను మీ తాత కూడా విమర్శింవారని ఎద్దేవా చేశారు. సోరోస్, జుకర్ బర్గ్, హిండెన్ బర్గ్ లకు రాహుల్ గాంధీ బాధ్యతను అప్పగించిట్లున్నారని ఆరోపించారు. భారతకు కొత్త సమస్య సృష్టించిన ఈ సంస్థ రేపు మూతపడడం ఖాయమన్నారు. మరీ వారి ఆరోపణలను మోసిన రాహుల్ గాంధీ ఇప్పుడేం చేస్తారని నిలదీశారు. దేశంలో సమస్యను సృష్టించి ప్రపంచంలో అభాసుపాలు చేయాలన్నదే వారి ఉద్దేశ్యంలా కనిపిస్తుందని రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు.
అన్నా హజారే పేరు చెబుతూ, ఆయన నైతికతతో వచ్చిన పార్టీ ప్రస్తుతం ఢిల్లీ అవినీతికి కేరాఫ్ గా మారిందన్నారు. ప్రజలకు ఆహారం అందించాల్సిన ప్రభుత్వ మద్యం పేరుతో అవినీతికి దిగిందన్నారు. నైతికత పేరుతో అధికారంలోకి వచ్చి అవినీతితో సొంత కుంపటికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.