దీక్ష విరమించిన జెఎస్పీ అధినేత ప్రశాంత్​ కిషోర్​

Retired JSP leader Prashanth Kishore

Jan 16, 2025 - 18:07
 0
దీక్ష విరమించిన జెఎస్పీ అధినేత ప్రశాంత్​ కిషోర్​

పాట్నా: గత 14 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జన్​ సూరజ్​ పార్టీ అధినత ప్రశాంత్​ కిషోర్​ ఎట్టకేలకు దీక్షను విరమించారు. బీపీఎస్పీ పరీక్షను రద్దు చేయాలని ఆయన దీక్ష కొనసాగిచారు. గంగా పథ్​ సమీపంలో గంగా నదిలో స్నానం చేసి దీక్ష విరమించారు. బీపీఎస్పీ పరీక్షలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ దీక్షకు దిగారు. జనవరి 2న ప్రారంభమైన దీక్షలో పోలీసు ఉద్యోగం కోసం ట్రైనింగ్​ చేస్తున్న విద్యార్థులను పెద్ద ఎత్తున రప్పించారు. ఈ విషయంపై పలు విమర్శలకు కూడా తావిచ్చాయి. దీక్షను ముగించే ముందు మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రయోజనాల కోసం తాను కట్టుబడి ఉంటానన్నారు. కుల, మతాలకు అతీతంగా పిల్లలకు మంచి భవిష్యత్​ ను అందించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వారి భవిష్యత్​ సువర్ణమయంగా తీర్చిదిద్దేందుకు, పరిష్​కార మార్గం లభించే వరకు ప్రభుత్వంతో తన పోరాటం తప్పదని ప్రశాంత్​ కిషోర్​ అన్నారు.