శ్రీరామ దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు

Devotees flocking to have a glimpse of Lord Rama

Jan 28, 2025 - 15:08
 0
శ్రీరామ దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు

లక్నో: మహాకుంభ మేళాకు వస్తున్న భక్తుల్లో చాలామంది అయోధ్యలో శ్రీరాముని దర్శనానికి వెళుతుండడంతో భారీగా క్యూలైన్లు పోటెత్తుతున్నాయి. మంగళవారం భారీ ఎత్తున శ్రీరాముని దర్శనానికి భక్తులు విచ్చేశారు. దీంతో రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ ప్రధాన కార్యదర్శి చంపత్​ రాయ్​ భక్తులు విడతల వారీగా రావాలని, సమయం తీసుకోవాలని మైకులో విజ్ఞప్తి చేశారు. అలాగే స్థానికంగా ఉండే భక్తులు 15, 20 రోజుల తరువాత శ్రీరాముని దర్శించుకోవాలని, ప్రస్తుతం దూరతీరాలను నుంచి వస్తున్న వారికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జనవరి 29 (బుధవారం) మౌనీ అమావాస్య సందర్భంగా శ్రీరామునికి ప్రధాన స్నాన ఆచారం నిర్వహిస్తామని చంపత్​ రాయ్​ పేర్కొన్నారు. భక్తులు భారీగా వస్తుండడంతో మీడియాతో చంపత్​ రాయ్​ మాట్లాడారు. గత వారం పది రోజులుగా అయోధ్యకు భారీ సంఖ్యలో వస్తున్నారని అన్నారు. ఇంత జనాభాకు ఒకేరోజు శ్రీరాముని దర్శనం చేసుకోవడం అసాధ్యమని, కష్టతరమన్నారు. దీంతో ప్రజలకు ఆలయ సేవలకు అసౌకర్యాలు తలెత్తుతున్నాయని తెలిపారు. భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని భద్రతా చర్యలను కూడా పటిష్ఠం చేశామన్నారు. వసంత పంచమి అనంతరం శ్రీరాముని దర్శనానికి అనుకూలమని అప్పుడు క్యూలు కూడా తగ్గుతాయని అన్నారు. తాను చేస్తున్న విజ్ఞప్తిని భక్తులు పరిశీలించాలని కోరారు.