28శాతానికి సెమీ కండక్టర్ల డిమాండ్
సీఆర్ఐ సర్వేలో వెల్లడి
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్ లో సెమీ కండక్టర్ల డిమాండ్ 2026 చివరి నాటికి 28 శాతానికి పెరుగుతుందని క్యాప్ జెమినీ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (సీఆర్ఐ) మంగళవారం వెలువరించిన నివేదిక వెల్లడించింది. 29 శాతానికి కూడా చేరుకోవచ్చని పేర్కొంది. ఎఐ చిప్ లు, కస్టమ్ సిలికాన్ చిప్ లు, మెమరీ ఇంటెన్సివ్ చిప్ లకు అత్యధిక డిమాండ్ ఉండనుందని స్పష్టం చేసింది. 88 శాతం ప్రపంచ సంస్థలతో పోలిస్తే, ఎఐ సాంకేతికత కోసం రూపొందించిన చిప్ లకే అధిక డిమాండ్ ఉండనుందని తమ సర్వేలో తేలినట్లు సీఆర్ ఐ స్పష్టం చేసింది. భారత్ లో ఉన్న చిప్ ల తయారీ సంస్థలు పెద్ద, మధ్య తరహా, చిన్నతరహా పరిశ్రమల వృద్ధికి కారణమవుతుందని తెలిపింది. 54 శాతం భారతీయ సంస్థలు ఇప్పటికే కస్టమ్ సిలికాన్ చిప్ లను ఉపయోగిస్తున్నాయి. జీపీయూ కంప్యూటింగ్ లోనూ పురోగతి అత్యధికంగా ఉంటుందని 45 శాతం భావిస్తున్నట్లు సీఆర్ ఐ పేర్కొంది. మెరుగైన భద్రత ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యం లభిస్తున్నందున అగ్రశ్రేణి సాంకేతిక ఆవిష్కరణలకు మరింత ఊతం లభిస్తుందన్నారు. 52 శాతం మంది భవిష్యత్ లో సెమీకండక్టర్ పరిశ్రమ రంగం భవిష్యత్ అవసరాలను తీర్చే వేగవంతమైన ఆవిష్కరణలను కొనసాగిస్తుందని విశ్వసిస్తున్నట్లు తమ నివేదికలో స్పష్టమైందని సీఆర్ఐ తెలిపింది.