ఢిల్లీ ప్రమాదం.. సీబీఐ దర్యాప్తునకు కోర్టు ఆదేశం

అమాయకులను అరెస్టు చేస్తారా? పోలీసుల చర్యపై మండిపడ్డ కోర్టు

Aug 2, 2024 - 17:24
 0
ఢిల్లీ ప్రమాదం.. సీబీఐ దర్యాప్తునకు కోర్టు ఆదేశం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీలోని ఐఏఎస్​ కోచింగ్​ ఇన్​ స్టిట్యూట్​ ప్రమాదంపై సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు అనుమతించింది. కేసు తీవ్రత దృష్ట్యా సీబీఐకి అప్పజెబుతున్నామని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఢిల్లీ హైకోర్టులో శుక్రవారం ఓల్డ్​ రాజేంద్రనగర్​ ముగ్గురు విద్యార్థుల మృతి కేసుపై విచారణ చేట్టింది. విచారణపై పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎంసీడీ (మున్సిపల్​ శాఖ) నుంచి ఫైల్స్​ రాకుంటే కార్యాలయానికి వెళ్లి ఫైళ్లను సీజ్​ చేయాలని న్యాయమూర్తి పోలీసులకు స్పష్టం చేశారు. ఎస్​ యూవీ కారు రోడ్డుపై వెళుతుంటే అరెస్టు చేసేందుకు వస్తుంది కానీ నేరస్తులను అరెస్టు చేయరా? అని ప్రశ్నించింది. అమాయకులను వదిలి, నిందితులను అరెస్టు చేస్తే పోలీసు శాఖపై గౌరవ పెరుగుతుందని గుర్తు పెట్టుకోవాలన్నారు.