11వ రోజు కొనసాగుతున్న మెట్లబావి తవ్వకాలు

మధ్యయుగం ఆధారాలు లభ్యం

Dec 31, 2024 - 13:38
 0
11వ రోజు కొనసాగుతున్న మెట్లబావి తవ్వకాలు

లక్నో: యూపీలోని సంభాల్​ లో ఆర్కియాలజికల్​ సర్వే ఆఫ్​ ఇండియా చేపట్టిన తవ్వకాల్లో మెట్ల భావి మూడు అంతస్తులు వెలుగుచూశాయి. మంగళవారం 11వ రోజు కూడా పనులు కొనసాగుతున్నాయి. తవ్వుతున్న కొద్దీ చరిత్రకు సంబంధించిన అనేక సాక్ష్యాలు కూడా లభ్యమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. సంభాల్​ నుంచి 25కిలోమీటర్ల దూరం చందౌసీలో ఈ మెట్ల బావిని కనుగొన్నారు. ఇప్పటివరకు 15 అడుగుల లోతు వరకు తవ్వకాలు చేపట్టామన్నారు. మరో అంతస్తు ఉండే అవకాశం ఉందన్నారు. తవ్వకాల్లో మధ్యయుగం నాటి పలు ఆధారాలు లభించాయన్నారు. 1720లో ఈ మెట్ల బావిని రాజా చంద్ర విజయ్​ సింగ్​ నిర్మించారన్నారు. ఈ మెట్ల బావిలో రాణులు స్నానానికి వచ్చేవారని పలు పుస్తకాల్లోని ఆధారాలు లభించాయన్నారు. ఈ మెట్ల బావి నాణ్యత ఇప్పటికే ఏ మాత్రం చెక్కుచెదరలేదన్నారు. సంభాల్​ లో ఏఎస్​ ఐ సర్వే ద్వారా మొత్తం 19 బావులను, ఐదు దేవాలయాలను గుర్తించారు. వీటన్నింటినీ ప్రభుత్వం పునరుద్ధరించే పనులు జోరుగా చేపట్టింది.