తృటిలో తప్పిన మరో విమాన ప్రమాదం
Another near-miss plane crash
ఆలస్యంగా వెలుగులోకి
వీడియో విడుదలతో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్
వాషింగ్టన్: అమెరికాలో బాస్కెట్ బాల్ ఆటగాళ్లు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఓ విమానం టేకాఫ్ తీసుకుంటుండగా మరో విమానం టేకాఫ్ తీసుకునేందుకు రన్ వేపై అత్యంత సమీపానికి వచ్చింది. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమై ఆ విమానాన్ని ఆపాల్సిందిగా పదేపదే ఆదేశించడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకున్నా మంగళవారం ఈ వీడియో బయటకు రావడంతో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. వాషింగ్టన్ లోని గొంజగా యూనివర్సిటీకి చెందిన పురుషుల బాస్కెట్ బాల్ జట్టు లాస్ ఏంజెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆ–135 జెట్ విమానంలో ప్రయాణిస్తున్నారు. ఈ విమానం రన్ వే పై టేకాఫ్ తీసుకుంటుండగా లైమ్ ఎయిర్ కు చెందిన 563 మరో విమానం ఈ విమానం వైపు వస్తుంది. వెంటనే సిబ్బంది అప్రమత్తమై అలర్ట్ చేయడంతో భారీ ప్రమాదం తప్పింది. కాగా ఈ వీడియోపై సోషల్ మీడియా వ్యాప్తంగా తీవ్ర విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో లాస్ ఏంజెల్స్ ఎయిర్ పోర్ట్ అథారిటీ ఈ తప్పిదంపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది.
అసలే ప్రపంచంలో వరుస విమాన ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. ప్రయాణికులు విమానాల్లో వెళ్లాలంటేనే జంకే పరిస్థితులు నెలకొన్నాయి. సాంకేతిక, మానవ తప్పిదాలు కారణాలు ఏవైనా విమాన ప్రయాణాల్లో భారీ యెత్తున ప్రయాణికులు మృతిచెందడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతుంది.