అమెరికాలో ట్రక్కు దాడి పిరికిపంద చర్య ప్రధాని మోదీ ఖండన
PM Modi condemns cowardly act of truck attack in America
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: నూతన సంవత్సరం సందర్భంగా అమెరికాలోని న్యూ ఓర్లీన్స్ లో జరిగిన ఉగ్రదాడిని ప్రధాని నరేంద్ర మోదీ పిరికిపంద చర్యగా అభివర్ణించారు. గురువారం సామాజిక మాధ్యమం వేదికగా దాడిని తీవ్రంగా ఖండించారు. దాడిలో మృతి చెందిన వారికి సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తీవ్ర విషాద సమయంలో గాయపడ్డ బాధితులు కోలుకునే వరకు వారికి బలంగా, ఓదార్పు లభించాలని ఆకాంక్షించారు. భారత ఆలోచనలు, ప్రార్థనలు ఎల్లప్పుడూ బాధితులకు అండగా ఉంటాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.