కార్ల అమ్మకాలలో గణనీయమైన వృద్ధి

Significant growth in car sales

Jan 2, 2025 - 18:39
 0
కార్ల అమ్మకాలలో గణనీయమైన వృద్ధి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: 2024 సంవత్సరం చివరి నెలలో భారీగా కార్ల కొనుగోళ్లు జరిగాయి. కార్ల కొనుగోళ్లలో 30 శాతం వృద్ధిని మారుతి సుజుకి నమోదు చేసింది. ఈ యేడాది మారుతి సుజుకి 1,78,248 కార్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో కార్ల విక్రయాలు 1,37,551 కార్లను విక్రయించింది. అలాగే మారుతీ సుజుకి ప్రత్యర్థి కంపెనీగా చెప్పుకుంటున్న హ్యుందాయ్, ఎస్​ యూవీ మేకర్ మహీంద్రా అండ్ మహీంద్రా, కియా మోటార్స్ కూడా కార్ల విక్రయాలలో ముందున్నాయి. 

దేశవ్యాప్తంగా ఒక్క డిసెంబర్​ నెలలోనే 1,30,117 కార్లను విక్రయించారు. ఏడాది క్రితం ఇదే కాలానికి సంబంధించి కార్ల విక్రయాలు 1,04,778గా నమోదైంది. గతం కంటే 24.18 శాతం ఎక్కువగా నమోదైంది. విక్రయాలలో మినీ ఆల్టో, ఎస్​ ప్రెస్సో అమ్మకాల్లో 7,418 యూనిట్ల వృద్ధి నమోదైంది. బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, వ్యాగన్ఆర్ వంటి కాంపాక్ట్ కార్ల అమ్మకాలు డిసెంబర్ 2023లో 45,741 యూనిట్ల నుంచి 2024లో 54,906 యూనిట్లకు పెరిగాయి. బ్రెజ్జా, ఎర్టిగా, ఫ్రాంటెక్స్, గ్రాండ్ విటారా, ఇన్విక్టో, జిమ్నీ, ఎక్స్‌ఎల్6తో సహా కంపెనీ ఎస్‌యూవీలు డిసెంబర్ 2024లో 55,651 యూనిట్ల అమ్మకాలను నమోదు చేశాయి. 

అదే సమయంలో కియా ఇండియా కార్ల అమ్మకాల్లో 6 శాతం వృద్ధి నమోదైంది. కియా ఇండియా 2024లో 2,55,038 అత్యధిక అమ్మకాలు చేపట్టింది. హ్యుందాయ్​ 2024లో విక్రయాలను చేపట్టింది. 6,05,433 కార్లను విక్రయించింది. క్రెటా ఎస్​ యూవీ 1,86,919 అమ్మకాలు, మహీంద్రా అండ్​ మహీంద్రా డిసెంబర్​ నెలలో 69,768 వాహనాల కొనుగోళ్లతో 16 శాతం వృద్ధి నమోదైంది. ఎస్​ యూవీ స్పోర్ట్​ 41, 424 కార్లను విక్రయించి 18 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఎగుమతులతో కలిపితే ఈ కార్ల అమ్మకాలు 42,958గా నమోదయ్యాయి. 

మొత్తానికి 2024 కార్ల విక్రయాలలో గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి.